టీడీపీ అధ్యక్షుడు అతని పుత్ర రత్నం నారాలోకేష్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.. తెలిసి తెలియని మాటలు మాట్లాడి 70 ఏళ్ళ వయసులో మీ నాన్నను వేధిస్తున్నావు కాదయ్యా అన్నట్టు అయన ట్విట్ చేశారు. ఆ ట్విట్ చూస్తే ఎవరైనా సరే.. లోకేష్ కాస్త బుర్ర ఉపయోగించు అని చెప్పస్తారు.. అలా ఉంది ఆ ట్విట్.
అసలు దేని గురించి ట్విట్ చేశారు అంటే.. ''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా'' అని నారా లోకేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఈరోజు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.
''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా”.. అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. “ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు''
— Vijayasai reddy v (@VSReddy_MP) June 27, 2020
అని గర్విస్తాడా, లేక...
విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా”.. అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. “ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు'' అని గర్విస్తాడా, లేక...'' అంటూ ట్విట్ చేశారు.
లోకేష్...!
— Vijayasai reddy v (@VSReddy_MP) June 26, 2020
సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్.
అవునా...! తీసుకుంటున్నావా...?
ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!
ఈరోజు ఇలా ట్విట్ చెయ్యగా.. నిన్న కూడా నరంలేని నాలుకతో నారాలోకేష్ మాట్లాడిన మాటా గురించి ట్విట్ చేశారు.. ''లోకేష్...! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా...! తీసుకుంటున్నావా... ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!'' అంటూ ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. ఇంకా ఈ ట్విట్లను చుసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.