ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దేశం తో సత్సంబంధాలు భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే అమెరికా తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కానీ అమెరికా చెప్పినదానికి తలూపుతూ ఉండడం లేదు భారత ప్రభుత్వం. కొన్ని విషయాల లో అమెరికా వాదనకు వ్యతిరేకం గా కూడా భారత ముందుకు సాగుతోంది. ఇతర దేశాలకు చెందిన ఏ వస్తువులు కూడా కొనకూడదు అని భారత్ కు -అమెరికా సూచించినప్పటికీ రష్యాతో ఆయుధాల ఒప్పందాన్ని చేసుకుంది భారత్.

 

 ఇలా పలు విషయాలను కూడా భారత్ సొంతంగానే ముందుకు వెళ్తుంది తప్ప అమెరికా చెప్పినట్లు గా వ్యవహరించడం లేదు. అంతేకాకుండా అమెరికన్ వస్తువులను భారత్లోకి వితౌట్ టాక్స్ అనుమతించాలని ట్రంప్  కోరితే ఇతర దేశా లు దానికి అంగీకరించాయి  తప్ప భారత ప్రభుత్వం మాత్రం అంగీకరించ లేదు. అదే సమయంలో చైనా తో కూడా మంచి సంబంధాల ను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది భారత్.

 


 కానీ ప్రస్తుతం అమెరికా అవసరం ఎందుకు అంటే.. ఒకవేళ చైనా తో పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ నేపాల్ లాంటి పలు దేశా లు చైనా తో కలిసి  యుద్దానికి దిగితే ఆ సమయం లో భారత్ కి మిత్రుడు అవసరం ఎంతైనా ఉంటుంది, అందుకే ప్రస్తుతం భారత్ అమెరికాతో మరింత సంబంధాల ను పెంచు కుంటుంది అని విశ్లేషకు లు అంటున్నారు. కానీ కొంతమంది మేధావులం  అని చెప్పుకునే వాళ్ళు మాత్రం అమెరికా తో సంబంధాలను తెంచుకోండి రష్యా తో ఎక్కువ గా సంబంధాలు పెంచు కోకండి అంటూ కొంతమంది అనవసర నీతులు చెబుతూ ఉంటారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకు లు...

మరింత సమాచారం తెలుసుకోండి: