ప్రస్తుతం చైనా భారత్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోకి వచ్చి చైనా తిష్టవేసుకునేందుకు ప్రయత్నిస్తే...  భారత సైన్యం మాత్రం వెనక్కి తగ్గకుండా చైనా సైన్యానికి గట్టిగానే బుద్ధి చెబుతుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన తాము సిద్ధమని భారత సైన్యం ఇప్పటికే చైనాకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్ లోని కొంతమంది మాత్రం ఏకంగా భారత దేశానికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తూ  ఉండడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం చైనా అటు పాకిస్థాన్ కి టు నేపాల్ కి ఆర్థిక సహాయం చేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది  విషయం తెలిసిందే,. 

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనాతో యుద్ధానికి సిద్ధం అంటున్న భారత్  ఒకవేళ పాకిస్థాన్ నేపాల్ కలిసి చైనా తో చేతులు కలిపి భారత పైన దాడికి దిగితే ఆ మూడు దేశాలు ఎదిరించగలదా  అనే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా చైనాతో గొడవలు తగ్గించుకొని అమెరికాతో సంబంధాలు కూడా దూరంగా ఉండాలని అంటున్నారు. అయితే ఇలా భారతదేశం పై భిన్నమైన విమర్శలు చేస్తున్న మేధావులకు పాకిస్తాన్ సైన్యం గురించి ఒక విషయం మాత్రం తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. 

 


 పాకిస్తాన్ సైన్యం లో కనీస శిక్షణ లేని పైలెట్లు ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు. యుద్ధ విమానాలు కాదు కదా కనీసం సాధారణ విమానాలు కూడా నడపడం పాకిస్తాన్ సైన్యం లోని పైలెట్లకు సాధ్యం కాదు అని అంటున్నారు. అందుకే గతంలో అభినందన్ తరిమితే ఒక ఎఫ్ 16 మాయమవ్వగా..  మొన్నటికి మొన్న అదంతట అదే ఎఫ్16 మాయం అయింది అని అంటున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్కు చెందిన పైలెట్లకు కనీసం విదేశాల్లో కూడా ఉద్యోగాలు దొరకవు అని అంత దారుణమైన శిక్షణతో పాకిస్తాన్ సైన్యం  ఉంటుంది దాని గురించి తెలుసుకుని భారత్ గురించి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: