ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు తెలుగుదేశం పార్టీని మరియు ఆ పార్టీకి మద్దతుగా ఉండే మీడియా వర్గాలని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జర్నలిజం విలువలు పడిపోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వ్యవస్థలను వాడుకుంటున్నారని అది ఇప్పుడు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారిందని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియా రంగంలో వార్తా చానల్స్ మరియు కొన్ని పత్రికలు చంద్రబాబు ఉప్పు తిని విశ్వాసంగా పనిచేస్తున్నాయని నాగబాబు గతంలో మాదిరిగా ఇటీవల విమర్శించారు.

 

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రాంతంలో భూవివాదాలు గురించి కూడా మళ్ళీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు లేవనెత్తారు. భూకబ్జాలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ నేతల తరువాతే ఎవరైనా అన్నట్టు నాగబాబు ఇంటర్వ్యూ లో టీడీపీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇదే తరుణంలో సీఎం జగన్ పరిపాలన గురించి ప్రశంసలు కురిపించారు. గతంలో కూడా నాగబాబు ఈ స్థాయిలోనే విమర్శలు చేసి తాజా ఇంటర్వ్యూలో కూడా మళ్లీ అదే తరహాలో మాట్లాడటం ఇక్కడ ఏపీ రాజకీయాల్లో పాటు సినీ రంగంలో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

నాగబాబు ఈ విధంగా సీరియస్ వ్యాఖ్యలు చేయడానికి రకరకాల కారణాలు వినబడుతున్న గాని ఎక్కువగా మాత్రం… బాలకృష్ణ గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు రెండు ప్రభుత్వాలను కలవటంతో చేసిన వ్యాఖ్యలను నాగబాబు మనసులో గట్టిగా పెట్టుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద తరహాలో వ్యవహరించడం తెలుగుదేశం పార్టీకి నచ్చకపోవడం వల్లే నాగ బాబు ఈ విధంగా రియాక్ట్ అయి ఉండవచ్చని మరి కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా మొన్నటి వరకు రాజకీయాలలో చాలావరకు కలిసికట్టుగా పని చేసిన టిడిపి జనసేన పార్టీ వర్గాలలో ప్రస్తుతం నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: