ఎవరితో పెట్టుకుంటే చిరిగి చాట అవుతుందో చైనాకు తెలిసివస్తోంది. తెంపరితనంతో రెచ్చిపోవడమే తెలుసు. కానీ ముందు ఉన్నది ఎవరో కూడా ఒకసారి చూసుకుంటేనే ఉనికి ఉండేది, ఊపిరి సాఫీగా సాగేది. మరి ఆ సంగతి మరచిపోయి పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించినందుకే ఏకంగా నలభై మంది చైనా సైనికులు చనిపోయారు. ఇది కక్కలేక, మింగలేక బయటకు చెప్పలేక చైనా సతమతమవుతోంది.

 

ఇక భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేపి ప్రపంచ దేశాలను హడలుగొట్టాలన్న డ్రాగన్ వ్యూహం కూడా బెడిసికొట్టింది. భారత్ కి మద్దతుగా ఆసియా దేశాలు ముందుకు వస్తున్నాయి. అమెరికా వంటి అగ్ర రాజ్యం కూడా మేముంటామంటోంది. యూరోపియన్ దేశాలు కూడా భారత్ సైడ్ తీసుకుంటున్నాయి. మొత్తానికి చైనా సాధించింది ఏంటి అంటే మరింత వ్యతిరేకత. ప్రపంచం ముందు ఒంటరిగా  ఏకాకిగా మిగలడం.

 

ఇవన్నీ చూసిన తరువాత మోడీ మరింతగా జోరు పెంచేశారు. 59 రకాల చైనా యాప్ లను రద్దు చేసి పారేసిన మోడీ సర్కార్ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తోంది.  చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. . ఇక తాజాగా హైవే ప్రాజెక్టులు, చైనాతో భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టులకు అనుమతించకూడని కూడా భారత్ నిర్ణయం తీసుకుంది. ఇది చైనాకు మరింతగా ఆర్ధికంగా నష్టం చేకూర్చే విషయమే.

 

ఇవే కాదు, టెలికాం రంగంలో కూడా 5 జి సేవలు వద్దు అనుకుంటోంది భారత్. దీంతో చైనా మహమ్మారి కంగారు పడుతోంది, భారత్ ఇంతటితో కూడా అగేట్లు లేదు. చైనాతో ఏ లింకులను కొనసాగించరాదని అనుకుంటోంది. దాంతో మరిన్ని షాకులు కూడా చైనాకు తప్పేట్లు లేవు. ఈ పరిణామాలతో చైనా బెంబెలెత్తిపోతోంది. ఇది ఆర్ధికం మాత్రమే, దౌత్యపరంగా చైనా సంగతి ప్రపంచం ముందు తేల్చిపారేసేలా భారత్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా సాధించింది ఏంటి అంటే మరింతగా దెబ్బతినిపోవడం. అందుకే దూకుడు కాదు, చూసి చూసి పెట్టుకోవాలి. అది కూడా  ఎవరితోనైనా పెట్టుకోవాలేమో కానీ భారత్ తో కాదు అని మోడీ సర్కార్ చైనాకు తమ దెబ్బ రుచి చూపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: