భారత‌ ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం స్పందించారు. చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌కు చెందిన కంపెనీల పట్ల వివక్ష పూరిత చర్యలు సరికావంటూ అక్కసు వెళ్లగక్కింది. భారత్‌ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో భారత ఉత్పత్తులు, సేవల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించడం లేదని.. భారత్‌ సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.


భార‌త్ వ్య‌వ‌హ‌రించిన తీరు అంత‌ర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లుగా ఉంద‌ని చైనా ఆరోపించింది. చైనాకు చెందిన  వాణిజ్య మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి గ‌వో ఫెంగ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. భార‌తీయ ఉత్ప‌త్తులు, సేవ‌ల ప‌ట్ల తాము ఎటువంటి ఆంక్ష‌లు కానీ వివ‌క్ష‌పూరిత చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ఫెంగ్ తెలిపారు. త‌మ దేశం, త‌మ కంపెనీల ప‌ట్ల తీసుకున్న చ‌ర్య‌ల‌ను స‌రిచేసుకోవాల‌ని చైనా వాణిజ్య మంత్రిత్వ‌శాఖ భార‌త్‌ను కోరింది.  గల్వాన్‌ లోయలో ఘాతుకానికి పాల్పడి 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాకు భారత్‌ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. డ్రాగన్‌కు చెందిన టిక్‌టాక్‌, హెలో వంటి 59 యాప్‌లపై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెందిన యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో స్వాగతించిన విషయం తెలిసిందే.


 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. భార‌త ప్ర‌భుత్వం 59 చైనా యాప్‌ల‌ను నిషేధించ‌డాన్ని..  ఐక్య‌రాజ్య‌స‌మితి మాజీ అమెరికా అంబాసిడ‌ర్ నిక్కీ హేలీ స‌మ‌ర్థించారు.  చైనా సంస్థ‌ల‌కు చెందిన యాప్‌ల‌ను బహిష్కరించ‌డాన్ని ఆమె స్వాగ‌తించారు.  ఇండియ‌న్ మార్కెట్‌లో విశేష ఆద‌ర‌ణ పొందిన టిక్‌టాక్‌ను కూడా బ్యాన్ చేయ‌డాన్ని నిక్కీ హేలీ ఓ మంచి ప‌రిణామంగా చెప్పారు.  చైనా దురాక్ర‌మ‌ణ‌కు.. భార‌త్ త‌న‌దైన రీతిలో ప్ర‌తిస్పందిస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు.  దేశ సార్వ‌భౌమాధికారానికి, ఐక్య‌త‌కు, భ‌ద్ర‌త‌కు చైనా యాప్‌ల‌తో ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆ దేశ యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: