ఓటు వేయాలంటే కచ్చితంగా పోలింగ్ బూత్ కి చేరుకోవాలి. 2019 ఎన్నికలు దేశంలో జరిగినపుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. బాగా వయసుమీరిన వారు ఎండల బాధ పడలేక నానా తంటాలు పడ్డారు. అటువంటి వారు తమ ఓటు కోసం ఎంతో దూరం  నుంచి రావడం, ఓటు వేయలేక కొందరు సొమ్మసిల్లిపడిపోవడం వంటివి కూడా అంతా చూశారు.

 

అయినా సరే ఎన్నో తనిఖీలు పరీక్షలు పెట్టి మరీ పోలింగ్ బూత్ లకు రావాల్సిందేనని ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు అమలు చేసింది. అయితే ఇపుడు కరోనా ఏం చెబితే అంత. అందుకే ఇపుడు అన్ని రూల్స్ మారిపోతున్నాయి. దానితో పాటే ఓటు నియమ నిబంధనలు కూడా చాలా మారిపోయాయి అని చెప్పాలి.

 

భారతీయ వైద్య పరిశోధన మండలి సూచనల మేరకు 65 ఏళ్ళు దాటిన వారు, సీనియర్ సిటిజన్లు ఇళ్ళలో ఉండి పోస్టల్  బ్యాలెట్ ద్వారా ఓటు చేయవచ్చు. అలాగే కరోనా రోగులు ఎవరైనా ఉన్నా, పరీక్షలు చేయించుకుని ఇళ్ళలో కానీ బయట కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు కానీ పోస్ట్ల బ్యాలెట్ ఉపయోగించవచ్చు.

 

ఇది నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో మొదటిసారిగా ఉపయోగించబోతున్నారు. ఈ మేరకు ఎన్నికల సవరణలు తెచ్చారు. ఇప్పటిదాకా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, మిలట్రీ సిబ్బందికే ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం  ఉండేది. కరోనా వచ్చి ఆ నిబంధలను మార్చేసింది అన్న మాట. దీన్ని బట్టి చూస్తూంటే ఇంకా చాలా మార్పులకు కరోనా కారణం అవుతుందని అంటున్నారు.

 

ఇది ఇక్కడితో ఆగిపోదు, రేపటి రోజున ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా ఇదే విధానాన్ని  అమలు చేస్తారన్న మాట. అదే జరిగితే సీనియర్ సిటిజన్ల ఇళ్ళ చుట్టూ రాజకీయ పార్టీలు ఇకపైన క్యూ కడతాయేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: