కరోనా తో సహజీవనం తప్పదు అంటున్నారు ఆరోగ్య  నిపుణులు. కరోనా ఇప్పట్లో పోయేది కాదు అంటున్నారు వైధ్య రంగ మేధావులు. ఇక దానికి వైరస్ కనిపెట్టడం అన్నది మాటలు కాదని కూడా చెబుతున్నారు. ఒక వేళ కనిపెట్టినా కూడా అందుబాటులోకి వచ్చేసరికి కనీసంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ కాలం పడుతుంది అంటున్నారు.

 

దానికి అనుగుణంగా ఇపుడు అన్ని రకాల కార్యక్రమాలు మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రసంగాలను వెబ్ నార్ ద్వారా కానీ, వర్చువల్ సెమినార్ల ద్వారా కానీ చేస్తున్నారు. ఇక వీడియో సమవేశాల ద్వారా అధికార పార్టీల‌ ముఖ్యమంత్రులు మంత్రులు చేస్తున్నారు. జామ్ యాప్ ను చంద్రబాబు లాంటి వారు ఉపయోగించి మహానాడుని నిర్వహించారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా ఎపుడు పోతుంది అన్నది ఎవరూ చెప్పడంలేదు. నెలా నెలా అని చెప్పి ఇప్పటికి  నాలుగు నెలలు నెట్టేశారు. ఇపుడు ఫలానా అని చెప్పకపోయినా పాలకులు అమలు చేస్తున్న కార్యక్రమాలు, వారు హడావుడిగా మార్చేస్తున్న  విధానాలు  చూస్తూంటే కరోనా ఇప్పట్లో పోయేది కాదు అని అర్ధమవుతోంది.

 

ఆన్ లైన్ విధ్యావిధానం అమలు చేయాలని అనుకుంటున్నారు. దాని ద్వారా ఈ ఏడాది అంతా సరిపడా షెడ్యూల్  ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ చేసి విడుదల చేస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే కరోనా ముప్పు ఏడాది వరకూ ఉంటుందని అంచనా వేసే ఇలా చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఎపుడో నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ఎన్నికల నియామావళిలో సవరణలు తెస్తున్నారు.

 

సీనియర్ సిటిజన్లకు ఓటు హక్కు ఇంటివద్ద నుంచే వినియోగించేలా మార్పులు చేయడం అంటే ఇది కచ్చితంగా కరోనా ముప్పు ఇప్పట్లో తప్పకపోవచ్చునని సూచిస్తోందేనని అంటున్నారు. అదే విధంగా ఇకపైన అన్ని రకాల కార్యక్రమాలు కూడా జనాల మాటున, సాంకేతికత నీడన చేయాలని పాలకులు ఆలోచన చేస్తున్నారు అంటే కరోనా మహమ్మారి అలా పట్టి పీడిస్తూనే కొన్నాళ్ళ పాటు ఉంటుందని అర్ధమవుతోంది అని మేధావులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఒక విషయం అర్ధమైపోయింది కరోనా ఎక్కడికీ వెళ్ళదని, మనమే భయం భయంగా బితుకు బితుకుగా బతకాలని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: