ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మిస్తామని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన విడుదల అయిందో లేదో అమరావతి రైతులు అందరూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాము పంట పండించుకొనే  భూమి తమ భవిష్యత్తు తరాలు బాగుంటాయనే  ఉద్దేశంలో రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేస్తే ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఉద్యమం  బాట పట్టారు అమరావతి ప్రజలు. 

 

 అప్పట్లో అమరావతి రైతులు చేసిన నిరసనలు  కాస్త ఉద్రిక్త పరిస్థితులకు కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా అమరావతిలో రైతుల నిరసన కొనసాగుతూనే ఉంది. అయితే అటు ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోవడం మానేసింది. అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతుల్లో కొంత మంది ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు కూడా పాల్పడిన విషయం తెలిసిందే. అమరావతి రైతులకు సంబంధించి సరికొత్త వాదనను తెరమీదకు వచ్చింది. 

 

 అమరావతి లో రైతులను చేపడుతున్న నిరసన   రెండు వందల రోజుకు చేరుకుంది అని ఇక ఇది కేవలం అమరావతి లోనే కాకుండా ప్రపంచంలోని 200 దేశాలకు పాకి పోయింది అంటూ  ప్రస్తుతం ఒక సరికొత్త వాదనను తెరమీదకు వచ్చింది. దాదాపు ప్రపంచంలోని 200 నగరాల్లో  అమరావతి కి మద్దతుగా నిరసన తెలుపుతున్నారు అంటూ ప్రస్తుతం టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషకు లు ఏమంటున్నారంటే అమరావతి రైతులు... లేదా అమరావతి లో భూములు కొన్న ఎన్నారైలు తప్ప అమరావతి కోసం ఎవరూ నిరసన  చేయడం లేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: