కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతుండటంతో భారీగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్నాగాని కేసులు భారీగానే బయటపడటంతో...కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని అధికారులు ప్రజలకు భరోసా ఇవ్వడంతో సామాన్య ప్రజలు అంత ఎవరికి వారు తమ పనుల్లో కరోనా సూచనలు తీసుకుంటూ యధావిధి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. జలుబ, దగ్గు లాంటి కనీస అనారోగ్య లక్షణాలు ఏమీ లేవు కానీ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.

IHG

అంతేకాకుండా ధైర్యంగా ఈ మహమ్మారి కరోనా ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కరుణ వైరస్ విషయంలో నియోజకవర్గ ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ప్రభుత్వ సూచనలు పాటించాలని కిలారి వెంకట నరసయ్య తెలిపారు. పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి విషయమైనా నాతో చర్చించాలంటే మొబైల్ మరియు మెసేజ్ వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటున్నట్లు కిలారి రోశయ్య పొన్నూరు ఎమ్మెల్యే ప్రజలకు చెప్పుకొచ్చారు.

IHG

ఎప్పటిలాగానే ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకు రండి మొబైల్ మరియు మెసేజస్ ద్వారా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా కరోనా వ్యాప్తి లేకపోయినా గాని కొత్త పాజిటివ్ కేసులు రైలు మరియు విమాన రాకపోకలు ద్వారా వస్తున్న ప్రయాణికుల ద్వారా నమోదు అవుతున్నట్లు ఏపీ హెల్త్ అధికారులు తెలుపుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: