ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దు వివాదం రోజురోజుకూ రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు చర్చలు జరుగుతున్నాయి కానీ మరోవైపు ఇరు దేశాల  సరిహద్దులో భారీగా సైన్యం మోవహరిస్తున్నారు, అయితే  సరిహద్దులో  వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎవరూ ఊహించని విధంగా ఎలాంటి సమాచారం లేకుండా ఏకంగా సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు.. ఆర్మీ ఉన్నతాధికారి లో చర్చించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా... ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రధాని మోదీ పర్యటన చేయడం నిజంగా సంచలనమే రేపింది ఎలా చెప్పాలి

 


 అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో  ఒక్కసారిగా చైనా వణికిపోయింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో  సైనికులందరిలో  సరికొత్త ఉత్తేజం తీసుకొచ్చారు, సైనికులు అందరికీ మానసికంగా ఒత్తిడికి గురయ్యేలా చేసేందుకు  చైనా ప్రయత్నిస్తే ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన మాత్రం అందరూ సరికొత్త ఉత్తేజం నింపి ధైర్యాన్ని నింపింది అని చెప్పాలి. అదే సమయంలో మోడీ ప్రసంగం చేసిన వ్యాఖ్యలతో చైనా  స్పందించేలా చేసింది. సామ్రాజ్యవాద విస్తరణ ధోరణి ఇకనైనా మానుకో అంటూ చైనాకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 

 

 దీంతో వెంటనే స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదాన్ని శాంతియుతంగా సామరస్యంగా సద్దుమణిగేలా చేయడానికి ప్రస్తుతం పరస్పర చర్చలు జరుపుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఉద్రిక్తలు మరింత పెంచే విధంగా వ్యవహరించడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించింది. అయితే సరిహద్దుల్లో భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించేది చైనా.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైన్యంపై దాడి చేసింది చైనా.. భారత సైన్యం ఎంత చెప్పినా సరిహద్దున ఖాళీ చేయనిది  చైనా...అలాటిది  ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు సృష్టించవద్దని మాట్లాడుతుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: