ప్రపంచంలో ఎన్నో వింతలు మనం చూస్తుంటాం. ఎన్నో అద్భుతమైనవి.. మనం ఉహించలేనివి ఇక్కడ చూస్తుంటాం. ఇంకా అలాంటి అద్భుతాల్లో ఒకటి సాలెగూడు. సాలెగూడ ఎలావుంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు ఈ సాలెగూడును నిర్మించుకుంటాయి. 

 

IHG

 

ఇంకా ఆ సాలెగూడులో చిక్కిన కీటకాలు లేదా ఇతర సూక్ష్మజీవులు ఏవైనా సరే అందులో చిక్కుకొని విలవిల్లాడుతు ప్రాణాలు పోగుట్టుకుంటాయి. అందులో ఒక్కసారి ఇరుక్కున్నాయి అంటే వాటి ప్రాణాలు పోవడం ఖాయం. ఇంకా ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 

ఆ వీడియో ఏంటి అంటే? తరంతుల అనే జాతికి చెందిన పెద్ద సాలీడు ఆహారాన్ని నోట కరచుకున్న ఈ పాత వీడియోను 'వైల్డ్‌అట్రాక్షన్స్'‌ ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ''వామ్మో.. ఈ సాలెగూడు చాలా చాలా భయంకరంగా ఉంది'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: