దేశంలో లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా విషయంలో గాని అత్యధిక మరణాలు సంభవిస్తున్నా విషయంలో గాని ఈ రెండు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తి విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 122% ఉన్నట్లు ఇటీవల కేంద్రం తెలిపిన లెక్కల్లో బయటపడిన విషయం అందరికి తెలిసిందే. ఇదే తరుణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా సరిగా కేసీఆర్ సర్కార్ జరపడంలేదని విమర్శలు వస్తున్నాయి. మరోపక్క పాజిటివ్ కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

 

ఇలాంటి తరుణంలో కరోనా  కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ- ఆఫీస్ వ్యవస్థ ద్వారా పాలన సాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుండి ఈ- ఆఫీస్ వ్యవస్థ విధానాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అమలు చేయాలని తెలంగాణ సర్కార్ సరి కొత్త రూల్ పాస్ చేసింది. దీంతో వచ్చే వారం నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఇంటి నుండి పని చేయాలని యాజమాన్యాలు ఇప్పటికే  తమ కింది ఉద్యోగస్తులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క ప్రభుత్వ రంగంలో ఈ- ఆఫీస్ వ్యవస్థ అమలు చేయడం కోసం సరికొత్త సాఫ్టువేర్ తీసుకు రావటానికి తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది.

 

ముందుగా సచివాలయంలో తరువాత అన్ని ప్రభుత్వ ఆఫీస్ లో అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికోసం సాఫ్ట్ వేర్ ను చూసుకోవటానికి అలాగే పూర్తి డేటాను సమకూర్చుకోవడానికి డిజిటల్ సంతకాల సేకరణ అంత ఇంటికాడ నుండి చేయించడానికి రెడీ అవ్వుతోంది. దీంతో ప్రతి శాఖకు ఒక నోడల్ అదికారి సాంకేతిక సహాయకుడుగా ప్రభుత్వం నియమించడానికి రెడీ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: