ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ విలయ తాండవం చేస్తుంది. సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అధికారులు నాయకులు అనే తేడా లేకుండా అందరినీ మహమ్మారి వైరస్ కదిలిస్తుంది. ఇక దేవుడు చెంతకు కూడా  మహమ్మారి వైరస్ చేరిన విషయం తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీకాళహస్తి కాణిపాకం లో కూడా కరోనా  వైరస్ వెలుగులోకి రావడం. తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది వైరస్ బారిన పడ్డారు... శ్రీకాళహస్తిలో అర్చకుడు.. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం హోమ్ గార్డ్  కరోనా  వైరస్ బారిన పడ్డారు. అయితే ఇలా దేవాలయాలలో కూడా కరోనా  వైరస్ విజృంబిస్తోంది. 

 

 తాజాగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఆలయంలోకి కూడా కరోనా  వైరస్ ప్రవేశించింది . శ్రీశైలం సున్నిపెంట గ్రామంలో మొట్టమొదటిసారిగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనం  గా మారిపోయింది. ఇందులో ఒకరు శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా మరొకరు సున్నిపెంట లంబాడి తండ కు చెందిన వ్యక్తి. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడం కరోనా పరీక్షలు  చేసుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వెంటనే అధికారులు వారిని కర్నూలు క్వారంటైన్  కేంద్రానికి తరలించారు.  ఇక అంతే కాదు కొన్ని రోజులనుంచి హోమ్  గార్డ్ ఎవరిని  అన్నదానిపై   ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. 


 గత కొన్ని రోజుల నుంచి సదరు వ్యక్తితో   సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి వారికీ  పరీక్షలు నిర్వహించే పనిలో  పడ్డారు. అయితే శ్రీశైలం ఆలయ సెక్యూరిటీ గార్డు కు కరోనా అని తేలడంతో ప్రస్తుతం స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజురోజుకు దాదాపుగా 1000 వరకు కరోనా  వైరస్ కేసులు నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో 1263 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: