వైఎస్సార్, ఈ పేరుని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆంధ్ర రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్సార్, మొదటి నుండి కూడా ప్రతి ఒక్క పనిని ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ ముందుకు సాగె వారట. అలానే ముఖం పై ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో క్రింది స్థాయి కార్యకర్త నుండి, పై స్థాయి నాయకుడి వరకూ కూడా అందరితో కలిసి మెలిసి సరదాగా వ్యవహించే అలవాటున్న వైఎస్ఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలవడానికి ఆయన మంచితనం కొంత కారణం అని ఆయన గురించి తెలిసిన వారు అంటుంటారు. ఇచ్చిన మాట ఎన్నటికీ మరువని మహోన్నత వ్యక్తి వైఎస్ అని, అలానే ప్రజల వద్దకు వెళ్ళినపుడు కూడా ఎక్కడికక్కడ వారి సాధకబాధకాలు తెలుసుకుని వాటిని ఎప్పుడూ తన మనసులో జ్ఞప్తికి తెచ్చుకుంటూ, సరిగ్గా తనకు అవకాశం రాగానే వెంటనే వాటిని తీర్చేవారని ఆయన అనునాయులు ఎందరో అంటుంటారు. 

IHG

ఇకపోతే ఒక్కగానొక్క తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ కు మొదటి నుండి ఎంతో ప్రాణం అని, కొడుకుని ఎంత పైచదువులు చదివించినప్పటికీ కూడా, అతడి ఇష్టాలను తెలుసుకుని ఆపై రాజకీయాల్లోకి తీసుకువచ్చారని సమాచారం. ఇక తండ్రి దారిలోనే పలు రకాల వ్యాపార సంస్థలు నెలకొల్పి నడిపించడంతో పాటు అటు  పలు మార్లు అత్యధిక మెజారిటీతో కడప ఎంపీగా గెలిచి అక్కడి ప్రజల సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు తీరుస్తుండేవారు జగన్. అయితే 2009లో తండ్రి హఠాన్మరణం అనంతరం అప్పటి అధికార పార్టీ జగన్ ను జైలు పాలు చేయడం, ఆపై ఏడాదికి పైగా శిక్ష అనంతరం బెయిలు పై బయటకు వచ్చిన జగన్, అనంతరం సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పి, ఆ తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరపున తొలిసారిగా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినప్పటికీ కూడా ప్రజలకు తన తండ్రి వలే తాను కూడా మంచి చేయాలనే తలంపుతో, మొక్కవోని దీక్షతో, ఆపై కొంతకాలానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యాత్ర చేయడం, ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోడం జరిగింది. 

 

అనంతరం భార్య, తల్లి, చెల్లి తోడుతో పాటు తండ్రి వైఎస్సార్ ఆశీస్సులతో మొన్నటి 2019 ఎన్నికల బరిలో నిలిచిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎవరూ ఊహించని అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందుకోవడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక గడిచిన ఈ ఏడాదిలో ఎక్కడికక్కడ ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకుంటూ ముందుకుసాగుతున్న జగన్ విజయాన్ని చూడడానికి తండ్రి వైఎస్ ప్రస్తుతం మన మధ్య లేరు, ఒకవేళ ఆయనే కనుక ఉండి ఉంటె, నిజంగా పుత్రోత్సాహంతో పొంగిపోయేవారు అని చెప్పకతప్పదు. కాగా నేడు ఆ మహానేత జయంతి సందర్భంగా ఆయను ఒకసారి గుర్తుచేసుకుందాం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: