వ్యాక్సిన్.. ఈ మూడు అక్షరాలు ఇపుడు తారకమంత్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఇపుడు ఆయువు. ఇదే ఊపిరి. చిత్రంగా అవీ మూడు అక్షరాలు. అవును ఇపుడు విశ్వమానవాళి అతి పెద్ద విపత్తులో చిక్కుతుంది. దారీ తెన్నూ తోచక నానా అవస్థలు పడుతోంది. మొత్తం భూగోళం మీద పై నుంచి దిగువదాకా ఉన్న‌ దేశాలన్నింటా కూడా కరోనా వైరస్ ఉంది.

 

ఆ మహమ్మారి లేని చోటు లేదు అంటున్నారు. సూర్యుడు కూడా జొరబడలేని కొన్ని ఖండాలు ఉన్నాయి. వాటికి చీకటి ఖండాలని పేరు. అలాగే సూర్యుడు రోజులో కొద్ది సేపు కూడా ఉండని దేశాలు, అతి కొద్ది సేపు ఉండే దేశాలూ ఈ భూగోళం మీద చాలా ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా ఇపుడు కరోనా ఉంది అంటే ఏం చెప్పాలి.ఎలా చెప్పాలి.

 

కరోనా మహమ్మరి సూర్యుడు కూడా చూడని చోటునా ఉన్నానంటోంది. మరి దీని మీద అంతా బెంబేలెత్తుతున్నారు. ఈ మనిషికి ఏదో ప్రమాదం ముంచుకువచ్చేసింది అని కూడా ఆందోళన చెందుతున్నారు. నిజంగా మానవజాతికి ఇది అంతమా. అందుకేనా కరోనా మహమ్మారిలా పట్టుకుంది. ఇక విడవను అంటోంది. రోడ్డు మీద పిట్టలా మనుషులు రాలిపోతున్నారు.

 

ఇది వినాశనమేనని కూడా అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఇక కరోనా రాకుండా ఉండాలంటే సామాజిక‌ దూరం పాటించాలిట. మనిషే  అసలు  సంఘ జీవి. అలా ఉండడం సాధ్యమేనా, ఉన్నా కూడా ఎంత కాలం ఉండగలరు అన్నది ఇక్కడ ప్రశ్న. అలాగే అనేక వ్రుత్తులు వ్యాపారాలు అన్నీ కూడా సామాజిక దూరానికి వ్యతిరేకం, మరి వాటి సంగతేంటి. అలాటి ప్రొఫెషన్లే ఈ ఆధునిక యుగంలో సగానికి పైగా ఉన్నాయి. మరి అవి కనుమరుగు కావాల్సిందేనా.

 

ఇక కరోనా మహమ్మారి ఇపుడు గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటున్నారు. మరి ఇంక దాని ధాటికీ, ఊపుకూ అడ్డేముంది. అలాంటపుడు మనిషి చేసేదేంటి. ఇవన్నీ ప్రశ్నలే. చర్చలే. అందుకే అంతా కోరుకుంటున్నారు. మా వల్ల కాదు ఇదంతా కానీ వ్యాక్సిన్ రావాల్సందే. అది వస్తేనే తప్ప బతకలేం. ఇపుడు బతుకుతున్నది అంతా భయం బతుకు. ఇది అసలు బతుకు కాదు అంటున్నారు. మరి ఇంతకీ  వ్యాక్సిన్ వచ్చెనా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: