దాదాపు గత కొన్నేళ్ల నుంచి అమెరికా-భారత్ మధ్య ఎంత సన్నిహిత సంబంధం కొనసాగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా దేశం ఏ దేశంతో  లేనంతగా భారత్తో ప్రస్తుతం ఎంతగానో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక ముఖ్యంగా ట్రంప్  అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మోదీ ట్రంప్ మధ్య సాన్నిహిత్యం బాగా కుదిరింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎప్పుడు భారత్ కి వెన్నంటే ఉంటుంది అమెరికా. అటు భారత్ కూడా అమెరికా విషయంలో ఎంతో సానుకూలంగా ఉంటుంది. అయితే ప్రతీ విషయంలో భారత్ కి ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా సపోర్ట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా భారత్ కి సపోర్ట్ చేయడానికి వెనుక కారణాలు ఏవైనప్పటికీ.. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఉన్నాయి అని చెప్పాలి. 

 


 అందుకే ప్రతి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు మద్దతుగా నిలుస్తున్నారు, కాగా  మోడీ అడగకముందే భారత్ కి మద్దతుగా అమెరికా తమ యుద్ధ నౌకలను  పసిఫిక్ మహా సముద్రం లో ఉంచి విషయం తెలిసిందే, ఇలా ప్రతి విషయంలో కూడా ప్రపంచ అగ్రరాజ్యం... నెంబర్ ఆర్థిక  శక్తి అయిన అమెరికా భారత్ కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా భారత్ కి గాలి వాల్వాన్  ఘర్షణ విషయంలో అమెరికా కితాబివ్వటం  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది, 

 

 గాల్వాన్ ఘర్షణ విషయంలో తాజాగా పాంపియో మాట్లాడినటువంటి మాటలు ఆసక్తికరం గా మారిపోయాయి. భారత సరిహద్దు వివాదం విషయంలో చైనా ఎంత దూకుడుగా వ్యవహరించిందని... అయితే చైనా దూకుడుకు భారత్ సరైన  బదులిచ్చింది. గత నెలలో భారత విదేశాంగ మంత్రితో పలుసార్లు చేర్పించామని.. త్వరలో చైనా అధ్యక్షుడికి పార్టీ నుంచి పొంచివున్న ముప్పును ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి అంటూ అయన తెలిపారు. అయితే త్వరలో డ్రాగన్ దేశం ఒంటరి అవుతుందని ప్రపంచ దేశాలు మొత్తం చైనాకు వ్యతిరేకంగా కదిలి వస్తాయి అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: