నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీ అధికార పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. ముందు నుండి సొంత పార్టీ వైసీపీ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏపీ వార్తల్లో నిలుస్తూ వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు ఉన్న కొద్ది స్పీడ్ పెంచుతూ నేరుగా పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఇటీవల చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ అధిష్టానం రఘురామకృష్ణం రాజు కి పార్టీ షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే తనకి వచ్చిన పార్టీ షోకాజ్ నోటీసులు గెలిచిన పార్టీ పేరు మీద కాకుండా.. వేరే అతను  స్థాపించిన పార్టీ పేరు పై షోకాజ్ నోటీసులు ఇవటం జరిగింది అంటూ రఘురామకృష్ణంరాజు ఈ విషయాన్ని కాంట్రవర్సీగా మార్చారు. ఇదే తరుణంలో బీజేపీ పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ ఏపీ అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా మారటం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో మంత్రి రంగనాథ రాజు పై మీడియాలో లైవ్ లో అప్పట్లో రఘురామకృష్ణంరాజు అవినీతి ఆరోపణలు చేయడంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు సదరు మంత్రి. దీంతో రఘురామకృష్ణంరాజు పై పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదులో మంత్రి పొందుపరిచారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేసి చాలా రోజులు అయినా ఇప్పుడు కేసు పెట్టడం వెనకాల ఆంతర్యం ఏమిటి అని వైసీపీ పార్టీలో డిస్కషన్ లు జరుగుతున్నాయి. 

 

సొంత సామాజిక వర్గానికి చెందిన నేత పైగా ఒకే జిల్లాకు చెందిన వాడు అయినా గాని రంగనాథ రాజు టైం చూసుకుని ఇలా కేసు పెట్టడం వెనకాల వైసీపీ అధిష్టానం స్కెచ్ వుందని...లీగల్ గా రఘురామకృష్ణం రాజు ని ఇరుకున పెట్టడానికి వైసీపీ అధిష్టానం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక పక్క పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చి మరోపక్క ఢిల్లీలో స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో టెన్షన్ లోపడిపోయారు నరసాపురం ఎంపీ. ఇలాంటి తరుణంలో త్వరలో పూర్తిగా రఘురామకృష్ణం రాజును పార్టీ నుండి సస్పెండ్ చేసి వైసీపీ  ఉప ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు… సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: