తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాలలో బిజీ అవుతారని గత కొన్ని నెలల నుండి వార్తలు వస్తున్నాయి. ఇదే టైమ్ లో ఆయన తనయుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. వస్తున్న వార్తలు కనుగుణంగానే టిఆర్ఎస్ పార్టీలో మార్పులు భారీస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మరోపక్క మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. ఇలాంటి తరుణంలో త్వరలో కేటీఆర్ పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కాబోతున్నట్లు స్వయంగా బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆయన పోస్ట్ కేవలం కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడటం లాగా కాకుండా మరొక వ్యక్తి ఫోటోలు జతచేసి వీళ్ళిద్దరిలో పట్టాభిషేకం ఎవరికో అంటూ పోస్ట్ పెట్టారు.

 

ఆయన పోస్టు చేసిన ఫోటో ఒకటి కేటిఆర్ ది మరొకటి సంతోష్ అనే వ్యక్తి ది. అయితే ఒక్క సారిగా బిజెపి ఎంపీ ఈ విధంగా పోస్టు పెట్టడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సంతోష్ ఎవరండి కెసిఆర్ కి పీఏ గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గా ఎదిగారు. అలాగే రాజ్యసభ ఎంపీగా కూడా రాణించడం జరిగింది. కెసిఆర్ ఎక్కడికి వెళ్లినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల సంతోష్ ప్రోద్బలం ఉంటుంది.

 

అటువంటిది కేసీఆర్ సొంత ఇలాకాలో కేటీఆర్ వర్సెస్ సంతోష్ అన్న రాజకీయాలు జరుగుతున్నాయని తెలంగాణ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందుమూలంగానే ధర్మపురి అరవింద్ తన పోస్టు ద్వారా పరోక్షంగా తెలియజేశారని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి విమర్శల వెనుకల సంతోష్ హస్తం ఉందని… ఈ విధంగా కేసిఆర్ తర్వాత కుర్చీ ఎక్కబోయే కేటీఆర్ ని సైడ్ చేసే కార్యక్రమం సంతోష్ చేస్తున్నట్లు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వ్యవహారం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: