జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలకు మొదటి నుండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అడ్డు పడుతూనే ఉన్నాడు. అయినా కానీ పార్టీలో పెద్దగా ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇంగ్లీష్ మీడియం విషయం లో గాని ఇంకా మరికొన్ని విషయాల్లో జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను రఘురామకృష్ణంరాజు బహిరంగంగానే మీడియా ముందు వ్యతిరేకించడం జరిగింది. అయితే ఉన్న కొద్దీ జగన్ కి మీద రెచ్చిపోతూ ఆయనకీ వ్యతిరేకంగా పనిచేసే మీడియా చానల్ లకి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులంటూ సొంత జిల్లాకు చెందిన వారిని దారుణమైన విమర్శలు చేయడం జరిగింది. ఎప్పుడైతే రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారో ఇక వెంటనే వైసీపీ అధిష్టానం అలర్ట్ అయ్యి మొదట ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది.

 

ఆ తర్వాత పార్లమెంటు పరిధిలో పార్టీపరంగా ఆయనకి ఉన్న పదవులను తొలగించాలని స్పీకర్ ని కోరడం జరిగింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేల చేత ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై జగన్ కేసుల వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట మంత్రి శ్రీ రంగనాథ రాజు తనపై రఘురామకృష్ణంరాజు లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించేలా కామెంటు చేశారని పోడూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది.

 

ఇదే తరుణంలో అదే జిల్లాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అదేవిధంగా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇద్దరూ కూడా రఘురామ కృష్ణం రాజు పై పోలీస్ కేసులు పెట్టారు.  ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు కి సొంత పార్టీ ఎమ్మెల్యేలు పెట్టిన కేసులు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆయన కూడా వారిపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: