సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే పెన్షన్ దారులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. పెన్షన్దారుల అర్హుల జాబితాలో లేని వారు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల వ్యవధిలోనే పింఛన్ మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.ఇక తాజాగా  ఏపీ లోని పింఛనుదారులు అందరికీ జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు అందరూ నెలకు 2250 రూపాయలు పెన్షన్ అనుకుంటుండగా... ప్రస్తుతం జగన్ సర్కార్ ఈ సొమ్మును మరింత పెంచింది.



ప్రతి ఒక్కరికి 250 రూపాయల చొప్పున పెంచుతూ ఆగస్టు నెల నుంచి 2500 రూపాయలు పెన్షన్  ఇచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గతంలో  ప్రతి ఏటా 250 రూపాయల పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పెన్షన్దారులు  అందరికీ 250 రూపాయల పెన్షన్ సొమ్ము  పెంచారు సీఎం జగన్. వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్ అందనుంది, ఆయా గ్రామాల గ్రామ వాలంటీర్లు ఈ పెన్షన్లు లబ్ధిదారులకు అందించనున్నారు.



ఇక గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారుల కోసం తీసుకున్న నిర్ణయం పెన్షన్ దారులకు ఎంతో ఊరట కలిగించింది అని చెప్పాలి. కేవలం దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే పెన్షన్ మంజూరు చేయాలనే ప్రక్రియను జగన్ సర్కార్ జూన్ ఒకటవ తేదీనుంచి శ్రీకారం చుట్టడం కారణంగా... పెన్షన్ అమలు విషయంలో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది, దీంతో పెన్షన్దారులు తమ పెన్షన్ కోసం మండలాఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గింది అనే చెప్పాలి. కేవలం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పెన్షన్ పొందగలుగుతున్నారు అర్హులు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: