ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ తప్పులు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షనిది. తీసుకునే నిర్ణయాలలో ఎలాంటి లోపం ఉన్న నిలదీయడానికి ప్రతిపక్షానికి అంతటి అధికారం కలిగిన దేశంలో ప్రస్తుతం మన వ్యవస్థ నడుస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల విషయంలో డైరెక్టుగా ప్రశ్నించలేరు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇప్పుడు ఇదే విధంగా చైనా విషయంలో మోడీ సర్కార్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా స్పందించింది. గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా ఆర్మీ భారత భూభాగాన్ని ఆక్రమించి ఉందని కానీ బయట ప్రపంచానికి మోడీ సర్కార్ అదేమీ లేదన్నట్టుగా చిత్రీకరిస్తున్నట్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

 

వాస్తవానికి అయితే 1962 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల చైనా మరియు భారత్ సరిహద్దు ప్రాంతాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడానికి కారణమని బీజేపీ ఈ ప్రాంతంలో ఎప్పుడు గొడవలు జరిగిన...ఈ పాయింట్ లేవనెత్తి మరీ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో చైనా వివాదాన్ని అడ్డంపెట్టుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పార్టీ ని నిలదీయడం తర్వాత ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు లను బీజేపీ టార్గెట్ చేసింది. అయితే ఈ ట్రస్టు లకు చైనా నుండి విరాళం పొందినట్లుగా గతంలో వచ్చిన ఆరోపణలను తవ్వి తీయటానికి మోడీ సర్కార్ రెడీ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే ప్రశ్నిస్తే జైల్లో పెట్టించే విధంగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడుతున్నారు. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ మన భూభాగాన్ని ఆక్రమించింది అని ప్రశ్నించడంలో తప్పేముంది మోడీ...అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: