13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ త్వరలో 25 జిల్లాలు గా మార్చడానికి జగన్ సర్కార్ డిసైడ్ అయింది. ఇటీవల కలెక్టర్ లు మరియు ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం పై కీలక వ్యాఖ్యలు జగన్ చేయడం జరిగింది.  ఆ తరువాత కొత్త జిల్లాలు ఇవే అంటూ అనధికారికంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఆచరణలో మాత్రం ఇప్పుడు అప్పుడే ఓకే అవ్వటం అన్నది అసాధ్యమన్నటు ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ లో ఈ విధంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది.

 

పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏకంగా 33 జిల్లాలుగా విడగొట్టారు. మొదటిలో 17 అనుకున్న చాలామంది డిమాండ్ల ప్రకారం 33 జిల్లాల తెలంగాణ ఏర్పడింది. ఇలా జిల్లాలుగా విభజించిన ప్రయోజనం ఏమాత్రం తెలంగాణ వాసులకు జరగలేదని తెలంగాణ వాసులు అంటున్నారు. పైగా కలెక్టర్లు మరియు ఎస్పీలు పెరగటంతో రెవెన్యూ డివిజన్ అధికారులు కనుమరుగయ్యారు అని అంతే తప్ప పాలనలో పెద్ద మార్పేమీ లేదని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులే జిల్లాల విభజన వద్దని బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు.

 

ఇటీవల ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా విభజించవద్దని ఓ సమావేశంలో మాట్లాడటం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తమ్మినేని కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరిచ్చిన ధైర్యం తో ఇతర జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలు కూడా పునర్విభజనపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను బయట పెడుతున్నారు. చాలా వరకు జిల్లాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చటం సరి కాదన్నది మెజార్టీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయం. ఇటువంటి తరుణంలో జిల్లాల పునర్విభజన విషయంలో జగన్ తాజాగా వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి పేషీలో డిస్కషన్ లు  జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: