మామూలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మత రాజకీయాలకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వాలు మైనార్టీ రాజకీయం చేస్తాయి అన్నది ఎప్పుడు రాజకీయవిశ్లేషకులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మైనార్టీ బుజ్జగింపు అనే దానికి పరాకాష్ట గా ఉంటుంది కేరళ రాష్ట్రం. మైనారిటీల బుజ్జగింపు విషయలో  కేరళ ముఖ్యమంత్రి పినరై చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. అదే సమయంలో హిందూ మతం విషయంలో కేరళ ముఖ్యమంత్రి కాస్త అలసత్వం నిర్లక్ష్యం తోనే ఉంటారు అన్న వాదన కూడా ఉంది. ఇక తాజాగా కేరళలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం గా మారిపోయింది. 

 

 ఏకంగా కేరళ ప్రభుత్వం చేసిన పనికి హైకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అసలేం జరిగిందంటే.. ఇటీవలే కేరళ ప్రభుత్వం ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని అనుకుంది. శుభకార్యాలకు పలు కార్యక్రమాల కోసం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక కమ్యూనిటీ హాలు నిర్మించడానికి కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. మామూలుగా అయితే ఇలాంటి కార్యక్రమాల కోసం ఒక ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అందులో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాయి ప్రభుత్వాలు. కానీ తాజాగా కేరళ ప్రభుత్వం మాత్రం ఏకంగా 2.6 ఎకరాల పరిధిలో ఉన్న విష్ణు ఆలయానికి కూల్చివేసి ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు నిర్ణయించింది. 

 


 దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న  హిందూ మత సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. ఇక దీనిపై స్పందించిన హైకోర్టు వెంటనే ఆలయ విగ్రహం ఎక్కడ ఉందో అక్కడ ప్రతిష్టించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో అటు హిందూ సంఘాలు  కేరళ ప్రభుత్వం చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సాదాసీదా కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ఏకంగా  దేవుడు ఆలయాన్ని కూల్చివేసి హిందువులను కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది  అంటూ ఆరోపణలు చేస్తున్నారు  చాలామంది. అయితే ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సదరు గుడి మళ్ళీ  నిర్మించాలా వద్ద  అనే ఆలోచనలో  ఉంది కేరళ  ప్రభుత్వం. రాబోయే రోజుల్లో  ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: