దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయని భారత ప్రజానీకం మొత్తం తీవ్ర భయాందోళనలు చెందుతున్న సమయంలో... పలు కంపెనీలు ప్రజలందరిలో కొత్త ఊపిరి నింపేలా  కరోనా  వైరస్ వ్యాక్సిన్ గురించి శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. మొదటగా గ్లెన్ మార్క్ అనే ఫార్మా కంపెనీ కరోనా  వైరస్ నియంత్ర కోసం ఉపయోగించే టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది, అంతేకాకుండా ఈ టాబ్లెట్లు ధర  కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించింది గ్లెన్ మార్క్  ఫార్మా కంపెనీ. కరోనా  వైరస్ నివారణ కోసం తయారు చేసిన పవిపిరవీర్  టాబ్లెట్ ధరను 103 రూపాయలుగా నిర్ణయించింది.



 అయితే ఈ టాబ్లెట్ ధర పై  మరో సారి పునరాలోచన చేసిన గ్లెన్  మార్క్ ఫార్మా కంపెనీ తాజాగా ఈ టాబ్లెట్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన ధర లో 27 శాతం కోత విధిస్తూ.. టాబ్లెట్ ధర 75 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది గ్లెన్ మార్క్ ఫార్మ కంపెనీ . పవిపిరవీర్ టాబ్లెట్ను ప్రాబిప్యూ  బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కు సంబంధించి స్వల్ప, మధ్యస్థ,  అతి ఎక్కువ లక్షణాలు ఉన్న వారు కూడా ఈ టాబ్లెట్ను వాడవచ్చు అంటూ వెల్లడించింది గ్లెన్ మార్క్ సంస్థ.




 అయితే 14 రోజుల పాటు క్రమంగా రెండుసార్లు వాడాలని తెలిపిన ఈ సంస్థ మొదటి రెండు రోజులు1800 ఎంజి  సామర్థ్యం కలిగిన టాబ్లెట్ లను  రెండుసార్లు వాడాలని ఆ తర్వాత 800 ఎంజి సామర్థ్యం  కలిగిన టాబ్లెట్ను 12 రోజులపాటు వాడాలి అంటూ తెలిపింది. ఇక ఇటీవల ఇండియా డ్రగ్  రెగ్యులేటర్ నుంచి తమకు అనుమతులు కూడా లభించాయి అంటూ సంస్థ తెలిపింది. అయితే త్వరలో తమ సంస్థ తయారుచేసిన కరోనా  వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది సంస్థ. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోజురోజుకు దేశం లో కరోనా  కేసులు విజృంభిస్తున్నాయి.  ఏకంగా కేసులా సంఖ్య  ఎనిమిది లక్షలు దాటిపోవడంతో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: