ముద్రగడ పద్మనాభం. సీనియర్ నేత. ఆయన రాజకీయంగా ఉంటూ మంత్రి పదవులను కూడా నిర్వహించారు. కానీ ఆయన రాజకీయాలు వదిలేసి కాపు ఉద్యమం వైపు మళ్ళారు. తన జాతికి రిజర్వేషన్లు అంటూ దశాబ్దాలుగా ఉద్యమిస్తూ వచ్చారు. ముద్రగడ ఇందులో సాధించింది ఏమున్నా కూడా  ఆయన రాజకీయంగా చాలానే కోల్పోయారు అని చెప్పాలి.

 

ఆయనే రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి కీలకమైన స్థానంలో ఉండేవారు. ముద్రగడ కాపు ఉద్యమాన్ని నింగి అంచుల వరకూ తీసుకెళ్ళారు. కానీ దాని ఫలితం ఆయన చేతుల్లో లేదు. ఆ మాటకు వస్తే ఆయన ఇపుడు దీని మీద  డిమాండ్  కూడా చేయడానికి తగిన పరిస్థితులు కూడా లేవు. రిజర్వేషన్లు పెంచడానికి నిబంధనలు ఉన్నాయి.  యాభై శాతం మించకూడదు కూడా. సుప్రీం కోర్టు తీర్పులు అలాగే ఉన్నాయి. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి. అలా చేయాలంటే దేశవ్యాప్తంగా అనేక కులాలు పోటీ పడతాయి.

 

అందరికీ రిజర్వేషన్లు పంచాలంటే వంద శాతం కూడా సరిపోవు. పైగా ఇపుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోఉంది. ఆ పార్టీ సిధ్ధాంత కర్త ఆరెస్సెస్  రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటారు. ఇలా ఎన్నో అవరోధాలు ఉన్నాయి. పైగా ఆర్ధిక పరమైన రిజర్వేషన్లు కల్పించి ఈ కధను ముగించాలని బీజేపీ చూస్తోంది అని చెబుతారు. ఆ తరువాత ఆర్ధిక రిజర్వేషన్లు ఎంతకాలం ఉంటాయో ఎవరికీ తెలియదు.

 

ఏది ఏమైనా ఇపుడు ముద్రగడ ముందుకు వెళ్ళలేనంతగా బిగుసుకుపోయారు. ఒకనాడు ఆయన పొరాటయోధుడే. ఇపుడు అలవి కానీ డిమాండ్ గా అది మారింది. ఇలా ముద్రగడ అనివార్యంగా తప్పుకున్నారని అంటున్నారు.ఇక ఆయన మళ్ళీ రాజకీయ అవతారం ఎత్తుతారు అని కూడా ఎవరూ అనుకోవడంలేదు. అయితే ఇది రాజకీయం ఏమైనా జరగవచ్చు. ముద్రగడకు రెండు పార్టీలలో అప్షన్  ఉంది. అది వైసీపీ, జనసేన, ఈ రెండూ కాదని వెళ్తే  బీజేపీ కూడా ఉంది. కానీ ఆయన టీడీపీలోకి వెళ్లరని అంటున్నారు. చూడాలి మరి 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: