ప్రపంచంతో కరోనా కర్ర బిళ్ల ఆడుతుంటే.. మానవత్వం మరచిన కొందరు వైద్యులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ఏమాత్రం అనుభవం లేకున్నా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వాస్తవానికి కరోనా స్వాబ్‌ నమూనాలను సేకరించాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పారామెడికల్‌ సిబ్బంది అవసరం. కానీ అనుభవం లేకున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఆ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు.

 

 

ఇక ప్రజల్లో ఉన్న భయాన్ని అవకాశంగా మలచుకుని ఈ అక్రమార్కులు, అనేకమంది బాధితులను తమ వలలో వేసుకుంటూ యదేచ్చగా అక్రమ సంపాదనకు తెరతీసారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కరోనా భయాన్ని కరెన్సీగా మార్చుకుని అందిన కాడికి దండుకుంటున్నారు.. ఆ వివరాలు తెలుసుకుంటే.. జనగాం జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారి తన క్లినిక్‌కు వచ్చే వారిలో కరోనా లక్షణాలున్న వారిని రాత్రి వేళ రమ్మని చెప్పి శాంపిళ్లను సేకరిస్తున్నారట. ఇదే కాకుండా వరంగల్‌కు చెందిన ‌ఒక ప్రభుత్వ వైద్యుడు కూడా ఇలాంటి నిర్వాకాన్నే వెలగబెడుతున్నాడట..

 

 

ఈ ప్రదేశాల్లో ఎక్కువగా కరోనా శాంపిళ్లు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వీరంతా తమ సొంత నర్సింగ్‌ హోంలో శాంపిళ్లను సేకరించి, ఇదివరకే హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న చోటుకు పంపిస్తున్నారట.. ఇలాంటి పరిస్దితుల్లో గత్యంతరం లేని కొందరు బాధితులు రూ. 3 వేల నుంచి 4 వేలు ఇచ్చి ఈ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక ఇలా వచ్చే ఫలితాల్లో పొరబాట్లు జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు..

 

 

అదీగాక  ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతి ప్రకారం ఒక పరీక్షకు రూ. 2,200 మాత్రమే తీసుకోవాలి. కానీ జనగాం క్లినిక్‌లో ఏకంగా రూ. 3,500 తీసుకోవడం గమనార్హం. అంతే కాకుండా కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తికి ఆ జిల్లాస్థాయి అధికారే వైద్యం చేయడం విడ్డూరం.. ఇలాంటి దోపిడి గాళ్లను కట్టడి చేయకుంటే సామాన్యులు ఆర్ధికంగా నష్టపోతారు.. కరోనా వైరస్ కూడా స్వేచ్చగా వ్యాపిస్తుంది.. మరి ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: