భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రెచ్చిపోతోంది. ఇవాళ ఏపీలో రికార్డు స్థాయిలో 37 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్ కేసులు కూడా రెండు వేలకు చేరువలో నమోదయ్యాయి. పోటాపోటీగా కేసులు నమోదవడంతో రెండు రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.  ఏపీలో కరోనా వైరస్ ఒక్కసారిగా మృత్యుఢంకా మోగించింది. కనీవినీ ఎరుగని రీతిలో చావుకేకలు వినిపించింది. 24 గంటల వ్యవధిలో 37 మందిని పొట్టన పెట్టుకుంది. 

IHG

ఏపిలో మృతుల్లో అనంతపురం జిల్లాలో(6), కర్నూలు జిల్లాలో(4), తూర్పు గోదావరి జిల్లాలో(4), పశ్చిమ గోదావరి జిల్లాలో(4), చిత్తూరు జిల్లాలో(3), గుంటూరు జిల్లాలో(3), కృష్ణా జిల్లాలో(3), ప్రకాశం జిల్లాలో(3), కడప జిల్లాలో(2), నెల్లూరు జిల్లాలో(2), శ్రీకాకుళం జిల్లాలో(1), విశాఖపట్నం జిల్లాలో(1), విజయనగరం జిల్లాలో(1) మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 365కి పెరిగింది.  ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే.. . రంగారెడ్డిలో 212 కేసులు నమోదయ్యాయి.

IHG

కరీంనగర్ 86, మేడ్చల్ 53, నల్గొండ 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్ అర్బన్ 16, మహబూబా బాద్ 13, మహబూబ్ నగర్ 13, భద్రాద్రి కొత్తగూడెం 10, సిద్దిపేట్ 10, సూర్యాపేట్ 10, జనగాం 10, వరంగల్ రూరల్ 8, నిజామాబాద్ 8, రాజన్న సిరిసిల్లా 7, పెద్దపల్లి 6, జయశంకర్ భూపాలపల్లి 6, యాదాద్రి 5, గద్వాల్ 5, వికారాబాద్ 3, నాగర్ కర్నూల్ 2, నిర్మల్ 1, మంచిర్యాల 1, అదిలాబాద్ 1, వనపర్తి 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ నేడు 9 మంది మృతిచెందగా, మృతుల సంఖ్య 365కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: