గ్యాంగ్ స్టర్  వికాస్ దూబే ను  ఇటీవలే పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే  ను పట్టుకునేందుకు వెళ్ళగా  ఏకంగా పోలీసులపై కాల్పులు జరిపి పరారైన దూబే..  ఎంతో మంది మరణానికి కారణం అయ్యాడు.. దీంతో ఈ కేసును ఎంతో సవాల్గా తీసుకుని యోగి సర్కార్.. రోజుల వ్యవధిలోనే వికాస్ దూబే ను  పట్టుకుంది.. అంతేకాకుండా వికాస్ గ్యాంగ్ లోని కీలక అనుచరులను  కూడా పట్టుకుని ఎన్ కౌంటర్ చేసింది. ఇక ఇటీవలే ప్రధాన సూత్రధారి అయిన వికాస్ దుబాయ్ కూడా ఎన్కౌంటర్ చేయడం సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే.



వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఈడీ  విచారణ కొనసాగిస్తునే ఉంది. ఈ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వికాస్ దుబే నెలకు కోటి రూపాయల వరకు సంపాదించే వాడు అని విచారణలో తేలినట్లు సమాచారం. అయితే ఇలా వచ్చిన భారీ  సొమ్మును దూబే ఎలా  ఖర్చు చేసేవాడు అన్నదానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి తాగుడు అలవాటు లేని వికాస్ దూబే  ఒక సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వాడట.



అంతేకాకుండా విదేశీ ప్రయాణాలకు కూడా దూరంగా ఉండేవాడట... అలాంటి దూబే భారీ మొత్తంలో వచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు చేసేవాడు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వికాస్ దూబే  దగ్గర ఉండాల్సిన డబ్బు ఏమైనట్లు అనే  కోణంలో కూడా ఈడీ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వికాస్ బ్యాంకు ఖాతాను గమనించగా అందులో ఎక్కువ మొత్తంలో సొమ్ము లేనట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సన్నిహితులు బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు, ప్రతినెల భారీ డబ్బులు వస్తున్న నేపథ్యంలో దూబే  డబ్బులను ఏదైనా వ్యాపారం కోసం వినియోగించాడా  అన్నదానిపై కూడా ప్రస్తుతం కూపీ లాగేందుకు  ప్రయత్నిస్తున్నారు  పోలీసులు, ఇలా నెలకు కోటి రూపాయల వరకు సంపాదించే దూబే ఈ డబ్బులు మొత్తం ఏం చేశాడు అనే దానిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈడి  దర్యాప్తు పూర్తవ్వాల్సిందే అన్న వాదన కూడా వినిపిస్తుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: