పేదల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకువచ్చింది. పశ్చిమగోదావరిలో తొలుత ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను మరో 6 జిల్లాలకు విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు. దీన్ని మరో ఆరుజిల్లాలకు విస్తరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. 

 

ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. అప్పటివరకూ ఉన్న వెయ్యి 59 వైద్య చికిత్సలకు , కొత్తగా మ‌రికొన్ని చేర్చారు. మొత్తం 2వేల 59 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఆరోగ్యశ్రీ అమలుకు పటిష్టమైన విధానాలను రూపొందించారు.

 

ఆ తర్వాత ఆరోగ్య శ్రీ కిందకు వచ్చే రోగాల సంఖ్యను 2వేల 146కు పెంచింది ప్రభుత్వం. సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు 2వేల 200 వైద్య సేవలు ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 

 

గత ప్రభుత్వ హయాంలో కేవలం వెయ్యి 59 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందేది. ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేసింది ప్రభుత్వం. పశ్చిమగోదావరిలో ఫైలెట్ ప్రాజెక్ట్‌గా మంచి ఫలితాలు రావడంతో మరికొన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. 

 

మొత్తానికి జగన్ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంటోంది. మెడికల్ బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్న జగన్ మాట నిలబెట్టుకుంటున్నారు. మరో 6జిల్లాలకు ఆ సేవలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: