ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో బయటపడుతున్నాయి. కొత్త పాజిటివ్ కేసులు ఎలా బయట పడుతున్నాయో అదేరీతిలో మరణాలు కూడా సంభవించడంతో ఏం చేయలేని పరిస్థితి అంతటా నెలకొంది. పైగా ప్రజలలో అసలు కరోనా వైరస్ గురించి భయాందోళన లేకపోవడంతో పాటు లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ లాంటివి ఏమీ ధరించకుండా బయటకు వచ్చేయడంతో గుంపులుగుంపులుగా తిరగడంతో వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉన్నట్లు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

 

ఇలాంటి దారుణం లో కరోనా కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా జిల్లాలలో లాక్ డౌన్ అమలులో ఉంది. ప్రకాశం మరియు తూర్పు గోదావరి జిల్లాలో లాక్ డౌన్ అమలు చేయగా ఇప్పుడు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఆ జాబితాలో చేరింది. కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరంలో లాక్ డౌన్ ను విధించారు.కేసులు పెరుగుతున్న వేళ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. 

 

ఉదయం 11 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు ఆ తర్వాత బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. చెప్పిన సమయం కంటే ఇంకా బయట తిరుగుతూ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ భారీ జరిమానా విధిస్తున్నారు. ఇదే తరుణంలో వాహనాలు దొరికితే సీజ్ చేసేస్తున్నారు. ఈ విధంగా ఈ నెల 19 వరకు జిల్లా మొత్తాన్ని లాక్ డౌన్ లో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: