తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా ఛానల్స్ విశాఖ ని గట్టిగా టార్గెట్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ త్వరలో పరిపాలన మొత్తం విశాఖకు తరలించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఇటీవల వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో బాబోరు మీడియా అమరావతి మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తూ విశాఖపట్టణం అంటే భయపడేలా చిన్న చిన్న సంఘటనలను భూతద్దం లో చూపించే విధంగా కథనాలు వడ్డీ వారిస్తున్నాయట.

 

అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో విశాఖపట్టణం లో జరిగిన ఇండస్ట్రియల్ ప్రమాదాల్లో దాదాపు 72 మంది చనిపోవడం జరిగింది. వాటిని ఏమి పట్టించుకోకుండా జగన్ వచ్చాక జరిగిన ఎల్జి పాలిమర్స్ మరియు ఇటీవల సాల్వెంట్ రాంకీ పరిశ్రమ అగ్ని ప్రమాదాలను పెద్దగా చూపుతూ విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదు అన్నట్టుగా బాబోరు మీడియా వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

ముఖ్యంగా విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వార్తలను కూడా పెద్దగా చూపించకుండా తాము అనుకున్న అమరావతి కాకుండా విశాఖ పట్టణాన్ని జగన్ రాజధానిగా చేస్తున్న తరుణంలో బాబోరు మీడియా విశాఖ ని గట్టిగా టార్గెట్ చేశాయి. ఆ ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదాలు పెద్దగా చూపుతూ రాష్ట్ర ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి మ‌సిపూసి మారేడుకాయ చేస్తున్నాయి అంటూ వైసీపీ మద్దతుదారులు ఆ వారపత్రికలో మరియు మీడియా చానల్స్ లో వస్తున్న వార్తలపై మండిపడుతున్నారు.

 

జరిగిన రెండు సంఘటనలకు సంబంధించి భారీ ఎత్తున ప్రజలంతా భయపడేలా కథనాలు బాబోరు మీడియా చూపిస్తూ విశాఖపట్టణం పై విషం జిమ్ము తున్నాయి అని వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. మరోపక్క జరిగిన ఘటనలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో విశాఖలో ఇలాంటివి జరగకుండా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల లో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: