రాజస్థాన్ రాజకీయాలు సంక్షోభంలో పడిపోయాయి. గతంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరుణంలో సచిన్ పైలెట్ కాంగ్రెస్ హైకమాండ్ తనకి సీఎం పోస్ట్ ఇస్తాడని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలెట్ ఆశలు అడియాశలు చేస్తూ అశోక్ గెహ్లాట్ కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఇదే టైములో సచిన్ పైలెట్ కి డిప్యూటీ సిఎం పోస్టు ఇవ్వటం జరిగింది. అయితే ఇటీవల ఒక్కసారిగా సచిన్ పైలెట్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని, పార్టీలో ఉన్న పెద్దలు సవతి తల్లి ప్రేమ తనపై చూపిస్తున్నట్లు ఒక్కసారిగా తనకు మద్దతు తెలిపిన పాతిక మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు కి రెడీ అయ్యారు. ఇటువంటి తరుణంలో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

 

పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు చేజారి పోకుండా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోకుండా కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో సచిన్ పైలెట్ వేరే కుంపటి పెట్టే అవకాశం ఉందని, కొత్త పార్టీతో రాజకీయాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క అమిత్ షా తో మంతనాలు జరిపి బీజేపీ పార్టీకి దగ్గరవ్వాలని సచిన్ పైలెట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి సచిన్ పైలెట్ బయటకు రావడంతో పూర్తిగా అమిత్ షా మీద ఆధార పడినట్లు...ఏదో విధంగా తనని నమ్ముకుని వచ్చిన ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలి అని అమిత్ షాతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒకవేళ అమిత్ షా గనుక సచిన్ పైలెట్ కీ హ్యాండ్ ఇస్తే కనుక తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలు ముందు సచిన్ పైలెట్ ఎప్పటికీ జీరో అవుతాడని… ఒకవేళ సాయం అందిస్తే హీరో అవుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: