దేశంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతూ ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలలో ఉన్న ప్రధాన నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. మరోపక్క దేశవ్యాప్తంగా మరొకసారి లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ వినబడుతుంది. అయితే ఈ తరుణంలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేసే పరిస్థితి ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. దీంతో చాలా వరకు మరణాలు సంభవిస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో కరోనా లేదు అన్నట్టుగా బలాదూర్ రాజకీయాలు చేస్తుంది అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వస్తుంది.

 

అదేమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో కరోనా మరణాలు సంభవిస్తూ ఉంటే మనుషులు ఆర్తనాదాలు చేస్తుంటే, మరోపక్క ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చే పని స్టార్ట్ చేసిందని జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన సచిన్ పైలెట్ కి బీజేపీ పార్టీ రెడ్ కార్పెట్ పరిచింది. ‘బీజేపీలోకి సచిన్‌ పైలట్‌ని ఆహ్వానిస్తున్నాం..’ అని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే సచిన్‌ పైలట్‌ తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా దాదాపు సచిన్ పైలెట్ బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

 

అసలు దేశంలో కరోనా మరణాలు సంభవిస్తుంటే బీజేపీ ఈ రకంగా వ్యవహరించటం దారుణమని దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను పోల్చడానికి బీజేపీ వ్యూహం పన్నుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. మరోపక్క రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేతిలోనుండి జారిపోకుండా, ప్రభుత్వం కూలిపోకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో టచ్ లో ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులు అందుబాటులో ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: