దేశంలో ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రబలి పోవడం మొదలైందో.. ఏది తాకాలన్నా.. ఏది తినాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఈ కారణంతోనే చాలా మంది బయట తిండి తినడం పూర్తిగా మానివేసిన విషయం తెలిసిందే.. దాంతో ఆర్థికంగా వేల మంది వ్యాపారులు కష్టాల్లో పడిపోయారు.  ఈ వైరస్ మనుషుల నుంచి క్షణాల్లో విస్తరిస్తున్న విషయం తెలిసిందే.. దాంతో మనిషి చూసి మనిషే భయపడిపోతున్నాడు. బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్ తప్పని సరిపాటిస్తున్నారు. అంతే కాదు మాస్క్ మన జీవితంలో ఒక భాగమైంది. శానిటైజర్ తమ వెంట తీసుకు వెళ్తున్న వారు ఉన్నారు... ప్రతి చోట ఈ సౌకర్యం కల్పించబడుతుంది. మొత్తానికి కరోనా వైరస్ మనిషి జీవన శైలినే మార్చివేసింది. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ఏది తినాలి, ఎలా ఉండాలి.., ఇలా ప్రతీ విషయంలో అందరూ ఆలోచిస్తున్నారు.  

 

ఈ క్రమంలో భారతీయ రైల్వే తొలి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ను సిద్ధం చేసింది. ఈ రైల్వే కోచ్ మనం రెగ్యులర్‌గా చూస్తున్న రైలు బోగీలా ఉండదు.  ఈ బోగిలో కరోనాని కట్టడి చేయానికి అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి.  కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రైలు బోగీ ఇది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న ‘పోస్ట్ కోవిడ్ కోచ్’లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీని ప్రత్యేకత ఏంటేంటే.. మన చేతికి ఏమాత్రం పని చెప్పనక్కలేదు.. ఎక్కడ పడితే అక్కడ చేతితో తాకవలసిన అవసరం లేదు.

 

వాష్ బేసిన్ దగ్గర్నుంచి వాష్ రూమ్ వరకు అన్నీ ప్రత్యేకతలతో దీనిని రూపొందించారు. వాటర్ ట్యాప్, ఫ్లష్ వాల్వ్ , సోప్ డిస్పెన్సర్, వాష్‌రూమ్ డోర్ వంటివాటిని చేతితో తాకుండా కాలితోనే ఆపరేట్ చేసేలా తయారు చేశారు. హ్యాండిల్స్‌కు ఇదివరకటిలా స్టీల్‌వి ఉండకుండా కాపర్ కోటింగ్, టైటానియం డయాక్సైడ్ కోటింగ్‌ ఉంటుంది. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తులు వాటిని తాకినా వైరస్ కొన్ని గంటల్లో చనిపోతుంది. ఇక  గాలిలో, ఉపరితలాలపై క్రిములను నాశనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాగా, ఈ రైలు బోగీలు అందుబాటులోకి వస్తే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: