అతనొక దివ్యాంగుడు... ఎన్నో మాయమాటలు చెప్పి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత వీరికి ఒక బాబు పుట్టాడు... కొన్నాళ్ళకి ఆ బాబు కూడా దివ్యాంగుడు అని తెలిసింది... కానీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు ఆ వ్యక్తి... తానే దివ్యాంగుడు అని అనుకుంటే... కొడుకు కూడా దివ్యాంగుడు గా మారిపోయాడు అని తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు... దీంతో భార్యను ఇంటి నుంచి గెంటేసాడు దివ్యాంగుడు అయిన భర్త... అంతే కాకుండా  మరో మహిళను పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పేశాడు. మళ్లీ తన దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే కొడుకుని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ లో చోటుచేసుకుంది. 

 

 ఆర్మూర్ రాజారామ్ నగర్ కాలనీకి చెందిన బ్రహ్మయ్య అనే దివ్యంగుడు... తనకు దివ్యాంగుడు కోటాలో మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మించి  యాదగిరిగుట్ట కు చెందిన శైలజ ను 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఏమీ రాలేదు. వీరికి ఆరు సంవత్సరాల క్రితం ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత వీరికి పుట్టిన బాబు అంగవైకల్యంతో పుట్టాడు అని గ్రహించాడు బ్రహ్మయ్య. ఈ క్రమంలోనే అంగవైకల్యంతో పుట్టిన కొడుకు విషయమై  దంపతులిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మహిళను ఇంటి నుంచి గెంటివేశాడు బ్రహ్మయ్య... మళ్లీ తన వైపు వస్తే కొడుకును చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. 

 

 అంతే కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకుంటానంటూ  తెగేసి చెప్పేశారు. ఇక పది రోజుల క్రితం  ఇంటి నుంచి గెంటి వేయబడిన మహిళ చేసేదేమీ లేక బోరున విలపిస్తూ మహిళా సంఘాలు ఆశ్రయించి న్యాయం చేయాలంటూ కోరింది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది సదరు మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు  వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: