కొన్ని కొన్ని సార్లు జరిగే అరుదైన ఘటనలు చూసి ఇది నిజమేనా అని నమ్ము లేకపోతు  ఉంటాం. కొన్ని ఆశ్చర్యకరమైన ఘటనలను  నమ్మడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. మామూలుగా అయితే ఒక కూతురుకి  డెలివరీ అవుతుంది అంటే తల్లిదండ్రులకు ఎంత టెన్షన్ ఎంత ఆనందం.. ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాస్పిటల్లో ఒకింత ఆనందం ఒకింత టెన్షన్ తో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులకు ఇలాంటి టెన్షన్ ఇలాంటి ఆనందమే ఉంది.. కానీ ఈ టెన్షన్, ఆనందం మామూలుగా కాదు మూడింతలు ఉంది. ఎందుకు అని అనుకుంటున్నారా... ఇక్కడ ఒక్కరు కాదు  తమ ముగ్గురు కూతుర్లకు ఒకే సమయంలో కాన్పు  జరిగింది కాబట్టి . 

 


 నిజంగా ఇది ఓ అరుదైన ఘటన అని చెప్పాలి. ఇక ముగ్గురు కూతుళ్లు ఒకే రోజు ఒకే సమయంలో డెలివరీ  జరగడంతో ఆ కుటుంబీకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ ఘటన అమెరికాలోని ఓహియో లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ధనిషా హయ్నెస్ , ఏరియల్ విలియమ్స్, ఆస్లే హయ్నెస్  ఈ ముగ్గురు యువతులు తోడబుట్టిన అక్క చెల్లెలు. అయితే ఈ ముగ్గురికి పెళ్లయిన తర్వాత ఒకే సారి గర్భం దాల్చారు... ఈ ముగ్గురికి డాక్టర్లు డెలివరీ డేట్ కూడా ఒకేరోజు ఇచ్చారు. జూలై 3వ తేదీన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకసారే పురిటి నొప్పులు రావడంతో ఓహియో మ్యాన్స్ ఫీల్డ్  హాస్పిటల్లో చేర్పించారు కుటుంబీకులు. 

 

 ఇలా నాలుగు గంటల వ్యవధిలోనే ఒక్కొక్కరుగా వరుసగా డెలివరీ అయ్యారు. తోబుట్టువులు ముగ్గురు ఒకేసారి ఒకే సమయంలో డెలివరీ అవడం అనేది చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఐదు కోట్ల మందిలో ఒక కుటుంబానికి ఇలాంటి అరుదైన ఘటనలు సాధ్యం అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు డాక్టర్లు ఒకేసారి సిజేరియన్ చేసి డెలివరీ చేశారేమో.. అందుకే ఒకేసారి ప్రస్తావించారు అని అనుకుంటే మాత్రం పొరబాటే... ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు సహజ పద్ధతిలోనే ఒకే సమయంలో బిడ్డలకు  జన్మనిచ్చారు. ఇలా తమ  ముగ్గురు కూతుర్లు ఒకేసమయంలో ముగ్గురు  బిడ్డలకు జన్మనివ్వడంతో  ఆ తల్లిదండ్రులు ఆనందోత్సాహాల్లో మునిగి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: