బీజేపీ పార్టీ దక్షిణాదిలో ఎప్పటినుండో పాగా వేయాలని అనేక ప్లాన్లు వేస్తోంది.  దక్షిణాదిలో కర్ణాటక లో తప్ప మిగతా రాష్ట్రాలలో బీజేపీ పెద్దగా బలమైన పార్టీగా ఉత్తర భారతం తో పోలిస్తే కర్ణాటక లో తప్ప ఎక్కడ లేదు. ఇప్పుడిప్పుడే ఇటీవల తెలంగాణలో కొద్దికొద్దిగా బలం పుంజుకుంటుంది. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో కలిసి గ్రూపు రాజకీయాలు చేస్తూ యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఏపీ లో కూడా పాగా వేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష పాత్ర రాబోయే రోజుల్లో పోషించడానికి బీజేపీ రెడీ అవుతున్నట్లు దానికి అండర్ గ్రౌండ్ వర్క్ కూడా రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్నట్లు ఇటీవల ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ డియోడర్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు బట్టి అర్థమవుతోంది.

 

పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన కామెంట్లకి బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ డియోడర్ గట్టిగా కౌంటర్ ఇచ్చేసారు. సునీల్ డియోడర్ ఏమన్నారంటే మాకు ఏపీలో పసుపురంగు ఒకటే కాదు అన్ని రంగులూ ఇష్టమేనని ఆయన చేసిన కామెంట్ యొక్క సారాంశం. దీంతో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే బీజేపీ సర్కార్ ఇన్ డైరెక్ట్ జగన్ కి వార్నింగ్ ఇచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

జగన్ ఏడాది పరిపాలన వరకు చూస్తే వైసీపీ కి చాలా క్లోజ్ గా ఉన్నట్టు బీజేపీ వ్యవహరించింది. కానీ ప్రస్తుతం జగన్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది అని, ఏపీ ఇంచార్జి సునీల్ డియోడర్ కామెంట్ లు చూస్తుంటే అర్ధమవుతోంది అని ..టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ రెడీ అవుతున్నట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్ కి ఇన్ డైరెక్ట్ వార్నింగే అని అభిప్రాయపడుతున్నారు. ఇదే తరుణంలో వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు బీజేపీ లో చేరితే… జగన్ సర్కార్ కి డేంజర్ బెల్స్ స్టార్ట్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: