ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" వ్యవహరిస్తున్న తీరుకి ప్రపంచం మొత్తం దండం పెట్టేస్తోంది. మొదటి నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శించటం అందరికీ తెలిసిందే. అసలు చైనా లో వైరస్ ప్రమాదకరంగా ఉన్న టైంలో "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" ప్రపంచదేశాలను ఎందుకు అలర్ట్ చేయలేదని ఒక దురుద్దేశంతో ఎవరి కిందో "WHO" పని చేస్తోంది అంటూ ట్రంపు సంచలన వ్యాఖ్యలు చేయటం అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే టైములో మొదటిలో కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని ప్రకటించడం జరిగింది.

 

ఆ టైంలో కొన్ని దేశాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు లేదు కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని నివేదికలు ఇచ్చినా "WHO" వాటిని కొట్టిపారేసింది. కానీ ఇటీవల కొన్ని దేశాలలో బయటపడిన కేసులు రిపోర్టులు చూసి "WHO" గాలి ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందని ప్రకటించడం తో… ప్రపంచ దేశాల నాయకులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాటలకు దండం పెట్టేస్తున్నారు.

 

మొత్తం ప్రమాదం అంత జరిగాక  ఇలాంటి ప్రకటనలు ఏంటి అని అనుమానిస్తున్నారు. గతంలో చైనా లోనే వైరస్ ప్రభావం ప్రమాదకరంగా ఉన్న టైంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదు, ఇప్పుడు గాలిలో వైరస్ ఉంటుందని అంతా జరిగిపోయాక ప్రకటించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త విని కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు అసలు కరోనా వైరస్ ని పుట్టించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయి ఉండి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో "WHO" వ్యవహరిస్తున్న వైఖరికి చాలా దేశాలు ఆ సంస్థ తాజాగా ఇస్తున్న ఆదేశాలను సూచనలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: