హైద‌రాబాద్‌లో క‌రోనా సృష్టిస్తున్న క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావానికి గురి కాని రంగాలేవీ లేవు. అయితే ఇది తాజాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు ఓ రేంజ్‌లో షాకిచ్చేలా ముందుకు సాగుతోంది. చిన్న చిన్న ఐటీ కంపెనీలు. ఓ వైరస్‌లా వచ్చి అన్ని వ్యవస్థలనూ ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనాను ఎదుర్కోలేక చిన్నస్థాయి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు కొత్త పొదుపు సూత్రాలను అవలంబిస్తున్నాయి. నగరంలో దాదాపు 1500 నుంచి 2 వేల వరకు చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలు ప్రతి నెలా సుమారు 30 శాతం నిధులు కార్యాలయ నిర్వహణ కోసం కేటాయిస్తాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 

 

 

ఓ వైరస్‌లా వచ్చి అన్ని వ్యవస్థలనూ ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనాను ఎదుర్కోలేక చిన్నస్థాయి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు కొత్త పొదుపు సూత్రాలను అవలంబిస్తున్నాయి. అటు తమ సేవలు, వ్యాపారానికి భంగం వాటిల్లకుండా ఇటు ఉద్యోగుల భద్రతకు నష్టం కలగకుండా అధిక ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. నాలుగు ఫ్లోర్లు అద్దెకు తీసుకున్న వాళ్లు రెండు ఫ్లోర్లలో మాత్రమే ఉద్యోగ సేవలను సరిపెట్టాలని యోచిస్తున్నాయి. ఇలా కరోనా ఆపత్కాలంలో ఖర్చులు తగ్గించుకునేందుకు హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాం గూడ తదితర ప్రాంతాల్లో కంపెనీలు తక్కువ అద్దెకు ఉన్న భవనాల్లోకి వెళ్లిపోతున్నాయి. తక్కువ విస్తీర్ణం గల గదుల్లోకి మారుతున్నాయి. కార్యాలయ స్థలాన్ని పొందే ప్రక్రియలో ఉన్నవారు లీజు ఒప్పందాలను రద్దు చేస్తుండగా.. ఇప్పటికే కార్యాలయ స్థలం ఉన్నవారు ఆఫీసు స్థలాన్ని విస్తరించడం అనవసరమని భావిస్తున్నారు.

 

 

వర్క్‌ ఫ్రం హోం నేపథ్యంలో యాజమాన్యాలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి.  నగరంలో దాదాపు 1500 నుంచి 2 వేల వరకు చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలు ప్రతి నెలా సుమారు 30 శాతం నిధులు కార్యాలయ నిర్వహణ కోసం కేటాయిస్తాయి. అయితే, ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్‌ వేదికలనే కార్యాలయంగా మార్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: