రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ అసమర్థ తను కచ్చిపుచ్చుకునేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ఆరోపణలకు పూనుకుం టోందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వర్షా భావ పరిస్థితుల కారణంగా అష్టకష్టాలు పడి పంటలు పండిం చిన రైతాంగం అప్పులు తీర్చే పరిస్థితులు కానరాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కారణంగానే అన్న దాతలు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయి లవన్మరణాలకు పాల్పడు తున్నారన్నారు. మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ వారి సంక్షేమాన్ని గాలికొదిలి పండుగల పేరిట దుబారా ఖర్చు చేస్తోందని ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన తెలుగు దేశం పార్టీ బస్సు యాత్రలో నేతలు విమర్శించారు. లక్సెట్టిపేట నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర జిల్లాలోని జన్నారం, ఉట్నూరు మీదుగా సాగింది. బీర్‌సా యిపేట్‌ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఎండిన పంట పొలాలను కూడా పరిశీలించారు. ఉట్నూరులో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో టీడీపీ నాయకులు ఎల్‌.రమణ, శాసన సభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మోత్కుపల్లి నర్సింలు, శాసన సభ్యుడు గరికపాటి రాంమో హన్‌రావు, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి తదితరులు ప్రసంగిం చారు. కరెంటు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరిం చారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తా మని కల్లబొల్లి మాటలు పలికిన ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా లైన్‌ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తెలం గాణలో కరెంటు రాకపోవడానికి చంద్రబాబు కారణమని నిరూపించాలని సవాల్‌ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నజరానాలు రూపంలో ఆశ చూపి తమ వైపు తిప్పుకోవడానికి కుట్రలు సాగిస్తుందని దుయ్యబట్టారు. తెదేపా కార్యకర్తలే పట్టుకొమ్మలని కార్యకర్తలే నాయకుల వుతారన్నారు. ఒకరిద్దరు నాయకులు పార్టీని విడిచినప్పటికీ ఎలాంటి నష్టం చేకూరదన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దా నాలను నిలబెట్టుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతాం గానికి ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండగా, కేసీఆర్‌ నిన్నటి వరకు మొద్దు నిద్రలో ఉండి బస్సు యాత్ర ప్రారంభం కాగానే భయపడి ఢిల్లిdకి వెళ్లి కరెంటు విషయంపై మాట్లాడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో ఓ పక్క పంటలు పండించిన పంటలకు మద్దతు ధర లేక కరెంటు లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం లో కనీసం చలనం లేదన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గిరిజనులు మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోలేదన్నారు. పత్తికి క్వింటాలుకు రూ.5000 మద్దతు ధర కల్పించాలని, మొక్క జొన్న రూ.1400 రూలు ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడి రైతాంగానికి అండగా తెలుగుదేశంపార్టీ పోరాడుతుందన్నారు. మరణిం చిన రైతు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించా లని, కరెంటు కోతల వల్ల ఎండిపోయిన పంటలకు రూ.20వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యువతకు, మహిళలకు, వృద్ధులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్ఛయంతో పని చేయాలన్నారు. ఈ సభలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు రమేష్‌ రాథోడ్‌, ఎమ్మెల్యేలు సాయన్న, వెంకటి వీరయ్య, వివేక్‌, గరికపాటి రమణా రావు, మదన్‌మోహన్‌ రావు, సుమన్‌ రాథోడ్‌, దయాకర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోలం శ్యాం సుందర్‌, అరిగెల నాగేశ్వర్‌రావు, అబ్దుల్‌ కలాం తదితరులు పాల్గొన్నారు.ప్రజా సమస్యలపై దృష్టి సారించండి. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన విద్యుత్‌ రంగం పట్ల అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని టీడీపీ నేతలు ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపిం చారు. ట్రయల్‌రన్‌ పూర్తి అయినా జూరాలలోని 240 మెగావాట్లు, నాగార్జున సాగర్‌లోని 60 మెగావాట్ల విద్యుత్‌ యూనిట్లు మునిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ కనీసం ఈ ప్రాజెక్టులను సందర్శించలేదని వారు విమర్శించారు. టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ తెలంగాణశాఖ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ కాదు ఆయన జేజమ్మ వచ్చినా కరెంట్‌ ఇవ్వలేరని ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్‌ సమస్యపై అంత స్పష్టత ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్టీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్ల తరువాత కనురెప్పపాటు సమయం కూడా కరెంట్‌ పోదని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలను ప్రస్తావిసూ అప్పటివరకు ఎంత మంది రైతుల కను రెప్పలు మూసుకుపోవాలని ప్రశ్నించారు. తామేదో రాజకీయం చేయడానికి ప్రస్తుతం ఎన్నికలు లేవు . రౖౖెతుల సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఢిల్లిd పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలుగుదేశం ఎమ్మెల్యేల వెంటబడే కన్నా వాళ్ల ఇళ్ల చుట్టు తిరిగే కన్నా వారి ఇళ్ల ముందు కుక్క కాపలా కాసే కన్నా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: