ఈవారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగమాగమయ్యాయి. చంద్రబాబు పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించడం, అడ్డుకోవాలని జేఏసి ప్రయత్నించడం, నేతల అరెస్టులు వంటివాటితో రాజకీయరచ్చ మొదలైంది. డిప్యూటిసిఎం, సిఎంల మద్య లొల్లి, కాంగ్రేస్ పెద్దల సమావేశంలో నాయకుల మద్య వాగ్వాదం, కేంద్రమంత్రివర్గ విస్థరణలో ఖరారైన ఏపినేతల జాబితా, కావూరి రాజీనామా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్న రాయపాటి వంటివాటితో అధికార కాంగ్రేస్ రగిలిపోయింది. పదవులు దక్కుతుండడంతో కొందరిలో ఆనందం చోటుచేసుకుంది. వేదిక కూలి బాబు యాత్రకు కాస్త విరామం, జ్వరంతో షర్మిల యాత్రలో తగ్గిన ప్రయాణం, వాగ్దానాలు, విమర్శలు వంటివి చోటు చేసుకున్నాయి. బాబు కు పాలమూర్ బ్రహ్మరథం పట్టడంతో టిడిపిలో హుషారు చోటుచేసుకోగా జేఏసి, టిఆర్ఎస్ లు ఆత్మరక్షణలో పడ్డాయి. చంద్రబాబు తన జోరును పెంచారు. తెలంగాణను వ్యతిరేకించం అంటూ ప్రకటించి, దానిని అడ్డుకుంటున్న అసలు దోషులు కాంగ్రేస్, టిఆర్ఎస్ అని పేర్కొంటూ పాలమూర్ లో ప్రజల జేజేలు అందుకోవడం తెలంగాణ తెలుగుదేశంలో ఈవారం ఉత్తేజం నింపింది. పనిలో పనిగా మాటల వాడిని పెంచి కాంగ్రేస్, వైఎస్సార్ సిపి, టిఆర్ఎస్ లపై ఆయన ఎదురుదాడికి దిగారు. మందక్రిష్ణ మాదిగతో పాటు మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు బాటలో బాబుకు బాసటగా నిలువడం విశేషం. మరోవైపు షర్మిల యాత్ర ఎలాంటి సంచలనాలు లేకుండా ఎప్పటిలాగే సాగింది. జగనన్న రాజన్న రాజ్యం తెస్తాననడం, కనిపించిన ప్రతిసమస్యకు తెలుగుదేశం, కాంగ్రేస్ లను బాద్యులను చేసి విమర్శించడం చేస్తూ పోయింది. ఎటూ పాలుపోని టిఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం కోసం కసరత్తులు ప్రారంభించింది. ఉద్యమకార్యాచరణ కోసం నవంబర్ అయిదు, ఆరు తేదీల్లో కరీంనగర్ లో పార్టి మహాసదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. దసరా లోపు తెలంగాణ వస్తుందన్న కేసిఆర్ మాట బెడసికొట్టడం, ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం టిఆర్ఎస్ లో అంతర్గత గుబులు పుట్టించింది. హరీష్ రావు, విజయశాంతిలు కేసిఆర్ తో అంటిఅంటనట్టుగా ఉండడం టిఆర్ఎస్ లో ఆందోలనకు కారణమయ్యాయి. బిజేపి నేత దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ లో తెలంగాణ నేతలు నోరుపారేసుకోవడం కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇక బిజేపి,వామపక్షాలు, ఇతరపార్టీల జోరు ఈవారం అంతగా కనిపించలేదు. ఉపముఖ్యమంత్రి దామోదరకు చెప్పకుండా ఆయన నియోజకవర్గంలో టూర్ లేకుండా సిఎం మెదక్ జిల్లా ఇందిరమ్మబాట నిర్ణయించడం కాంగ్రేస్ లో దుమారం లేపింది. దీనికి తాను తనజిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎత్తిపోతలకు సిఎం నిధులివ్వక పోవడంతో ఇది మరింత ముదిరింది. డిప్యూటి ఢిల్లీ టూర్ కు సిద్దం కావడం, బొత్స ఇరువురి మద్య చేరి గొడవను చల్లార్చడం, ఇందిరమ్మబాటలో ఆయన నియోజకవర్గం చేర్చడం, ఎత్తిపోతలకు నిధులివ్వడం జరిగిపోయాయి. ఈవ్యవహారంలో సిఎం కాస్తా పరువుపోగొట్టుకున్నట్లయింది. నామినేటెడ్ పదవులను రెండింటిని భర్తీచేస్తూ సిఎం నిర్ణయం ఏక పక్షంగా తీసుకోవడం కూడా పార్టీలో లొల్లికి దారితీసింది. దీంతో ఆరెండింటిలో మండలి బుద్దదేవ్ పదవి ఓకే తో మిగిలిన పదవుల పందేరం ఆగిపోయింది. పెద్దలసభలో లొల్లి, పెద్దలే పెదవి విప్పకపోవడం, మంత్రులు గైర్హాజరు కావడం వంటివి పార్టి పరువును దిగజార్చాయి. చివరకు జిల్లాల్లో పాదయాత్రలు, జిల్లాకో చైర్మన్ పదవి వంటివాటి ప్రకటనలతో పెద్దలభేటి ముగిసింది అన్పించారు. చివర్లో కేంద్రమంత్రి వర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి అయిదుగురి పేర్లు ఖరారైనట్లు తెలియడం, ఎప్పటినుంచో ఎదిరి చూస్తున్న కావూరి, రాయపాటి, విహెచ్ లకు రాకపోవడంతో, కావూరి రాజీనామా, రాయపాటి బెదిరింపులు, విహెచ్ నిరసన తెలుపడంతో రాష్ట్ర కాంగ్రేస్ కాస్త పట్టుకోల్పోతోందన్న సంకేతాలు వెలుబడ్డాయి. అదే తరుణం కేంద్రంలో పాతవారిలో ఇద్దరికి పదోన్నతి, మరో అయిదుగురికి అవకాశాలు అన్ని ప్రాంతాలను సమన్వయ పరుస్థూ ఇస్తుండడం పార్టీలో ఉత్తేజాన్ని నింపింది. కేంద్ర రాజకీయాల విషయానికి వస్తే గడ్కరీపై ఆరోపనలకు బిజేపి అండగా నిలువడం, డొల్లకంపెనీలపై విచారన జరుపుతాం అని మొయిలీ ప్రకటించడం, దానికి సిద్దమని గడ్కరీ స్పందించడం జరిగింది. సోనియా అల్లుడు రాబర్ట్ కు హర్యాన ప్రభుత్వం సఛ్చీలతా పత్రం ఇవ్వడం, అవీనీతిపై సోనియా, రాహూల్ బహిరంగవిచారణకు రావాలని కేజ్రివాల్ సవాల్ విసరడం వంటివి చోటుచేసుకున్నాయి. కాంగ్రేస్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో భారీ ప్రక్షలనకు పూనుకుంది. ఏకంగా తొమ్మిది మంది మంత్రులు రాజీనామాలు చేసి కొత్తవారికి అవకాశ మిస్తుండడం, వారు పార్టీ బాధ్యతలకోసం సిద్దమవుతున్నట్లు వార్తలు రావడం వంటివాటితో కాంగ్రేస్ 2014 ఎన్నికలకు సరికొత్త వ్యూహంతో సిద్దమవుతున్నట్లు స్పష్టం అయింది. మిగతా వాటి విషయానికి వస్తే సైనాసెహ్వాల్ బ్యాడ్ మెంటిన్ లో డెన్మార్క్ ఓపేన్ సాధించి దేశానికి, రాష్ట్రానికి వారం ఆరంభంలోనే శుభవార్తను వినిపించారు. బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా కన్నుమూయడం, అమెరికాలో తెలుగువనిత సత్యవతి, చిన్నారి శాన్వి హత్యకు గురికావడం, సాగరహారంలో టియర్ గ్యాస్ కారణంగా అస్వస్థకు గురైన రాజిరెడ్డి మృతిచెందడం, టివి సీరియల్ చిత్రీకరణ సందర్భంగా చిన్నారి సాత్విక్ రెడ్డి మరణించడం, మరోచిన్నారి గాయాలపాలు కావడం వంటి విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగన్ కేసులో విజయసాయిరెడ్డికి ఢిల్లీ రావాలని పిలుపురావడం, జగన్ ను సైతం విచారణ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ కి మారుస్థారని వార్తలు రావడం జగన్ శిబిరాన్ని కలవరానికి గురిచేసాయి. మూడు సిలిండర్ల సబ్సిడి భారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం విమర్శలకు దారితీయగా కాంగ్రేస్ కాస్తా సిఎం పై నిరసనలు వెల్లువెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: