సీనియర్ రాజ‌కీయ నేత‌ల విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శాసనమండలి మాజీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు వైఎస్ఆర్‌సీపీలో సముచిత స్థానం దక్కింది. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన తనయుడు రత్నాకరరావును అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల పరిశీలకునిగా నియమించారు.

 

పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్‌ రాజ కీయ వేత్తగా గుర్తింపు పొం దిన వీరభద్రరావు,  తనయు డు రత్నాకరరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు.

వీరభద్రరరావు, రత్నాకరరావులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి కీలకమైన బాధ్యతలను అప్పగించడం ద్వారా సీనియ‌ర్ల‌కు త‌గు ప్రాధాన్యం దక‌ల్పించిన‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: