ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం పరుస్తుందని ఇష్టానుసారంగా పోలీసులను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో సీఈసీ ని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఉన్న కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెంచాలు గా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపించారు.

Image result for vijaysai reddy

చంద్రబాబు చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ పార్టీకి చెందిన నేతల ఫోన్ లను టాపింగ్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఈ ఆగడాలు ఆధారాలతో సహా రాబట్టామని సీఈసీ కి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇక శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కెఎ పాల్ ఒక జోకర్ అని.. బ్రోకర్ అని.. రోజూ వచ్చి కామెడీ చేస్తుంటాడని ఎద్దేవా చేశారు. అంతే కాదు ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా, తమ పార్టీ గుర్తు, కండువాను పోలి ఉందని కాబట్టి ప్రజాశాంతి పార్టీ గుర్తు తొలగించాలని ఈసీని కోరినట్టు తెలిపారు. టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. 

Image result for vijaysai reddy

ముఖ్యంగా డిజిపి ఠాకూర్ చట్టాన్ని అతిక్రమిస్తూ  తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇంకా కొన్ని జిల్లాలలో ఎస్పీలు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ వైసీపీ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శల వర్షం కురిపించారు. ఈ విషయంలో సీఈసీ కలుగజేసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతల నెలకొల్పాలని విజయ్ సాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు.



మరింత సమాచారం తెలుసుకోండి: