తెలంగాణాలో స్థానిక సమరానికి నగరా మోగింది. అక్కడ మూడు విడతలుగా లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మే మొదటి వారం నుంచి మొదలై లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ వేళకు పూర్తి అవుతాయి. ఓ విధంగా కోడ్ ఉన్న టైంలోనే ఎన్నికలు జరిపించుకోవడం ద్వారా టీయారెస్ సర్కార్ మంచి పని చేస్తోంది. అదే టైంలో అయిదేళ్ళ పాటు ఇక ఏ ఎన్నికలు లేకుండా పరిపాలన మీద ద్రుష్టి కూడా పెట్టేందుకు వీలు ఉంటుంది.


అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీయారెస్ కు  చేదు ఫలితాలు వస్తాయని, అందువల్లనే ముందుగా లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టేస్తున్నారని అంటున్నారు. ఆ సంగతెలా ఉన్నా ఇపుడున్న పరిస్థితుల్లో టీయారెస్ ని ఢీ కొట్టేందుకు అక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా సన్నద్ధం కాలేకపోతున్నాయన్నది తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఒకపుడు అక్కడ బలంగా ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దెబ్బకు ఆ పార్టీ నడ్డి విరిగింది. పార్లమెంట్ కి కూడా  పోటీ చేయకుండా వూరుకుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బలమున్న చోట పోటీ చేయాలనుకుంటున్నారు.


మరో వైపు కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీకి తయార్ అంటున్నారు కానీ గెలుపు విషయంలో మాత్రం పెద్దగా ఆశలేవీ  పెట్టుకోవడంలేదు. ఇక వైసీపీ 2014 ఎన్నికల తరువాత తెలంగాణా వూసెత్తడం మానేసుకుంది. ఇపుడు జనసేన పార్టీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ అంటోంది. కాపుల బలం, ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల జనసేన పోటీకి రెడీ అంటున్నట్లుగా ఉంది. అదే విధంగా మెగా ఫ్యాన్స్ కూడా దండీగా తెలంగాణా అంతటా ఉన్నారు.


ఆయితే తెలంగాణాలో ఇవన్నీ ఎలా ఉన్నా లోకల్ అంటే పక్కా లోకల్ పార్టీకే పట్టం కడతారు. తెలుగుదేశం  బలమంతా ఆంధ్ర పార్టీ అన్నఒకే  ఒక్క మాటతో పోయింది. అలాగే, వైసీపీని కూడా పొరుగు పార్టీ అనేశారు. మరి జనసేన అధినేత పవన్ కూడా అచ్చమైన ఆంధ్రుడు. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని ఎంత చెప్పుకున్నా జనాలు చూసేది వాటినే. ఓటేసేది కూడా వాటికే. ఈ నేపధ్యంలో పోటీకైతే జనసేన రెడీనే కానీ ఎన్ని ఓట్లు వస్తాయి. సీట్లు వస్తాయన్నది చూడాలి. ఏది ఏమైనా ఓ పార్టీగా రెండు తెలుగు రాష్ట్రాలో ఉండాలన్న జనసేన ఆలోచన ఐతే మంచిదే.



మరింత సమాచారం తెలుసుకోండి: