పాపం ఇన్నిరోజులు చంద్రబాబు .. వైసీపీ మీద ఒకటే ప్రచారం చేశారు. అదేంటంటే వైసీపీ డబ్బులను విచ్చల విడిగా పంచిందని, ఇక ఈవీఎంల గోల ఉన్ననే ఉంది. అయితే  జగన్ భారీ డబ్బులు ఖర్చుపెట్టారని.. ఓట్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు తన వాళ్లతో వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాబు లీకు రాజకీయంలో భాగంగా అలా జరుగుతూ ఉంది.


ఏతావాతా ఈ ఎన్నికల్లో ఓడినా.. అది ఈవీఎల వల్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా డబ్బు ఖర్చుపెట్టడం వల్ల.. అని తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.   అయితే ఇలాంటి ప్రయత్నంలో ఉన్న టీడీపీకి జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. 'యాభైకోట్లు ఖర్చుపెట్టాం.. ఓటుకు రెండువేల రూపాయలు ఇచ్చాం..' అంటూ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాక ''పసుపు-కుంకుమ'' డబ్బులు బాగా ఉపయోగపడ్డాయి. అవి గనుక ఆడవాళ్లకు చేరకపోయి ఉంటే అంతే సంగతులు...' అని జేసీ వ్యాఖ్యానించారు.


ఒకవైపు వైఎస్సార్సీపీ భారీగా డబ్బులు పంచింది అని చంద్రబాబు నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో జేసీ దివాకర్ రెడ్డి తాము ఓటుకు రెండువేల రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే ప్రజల సొమ్ముతో డ్వాక్రా మహిళల ఓట్లను కొనుగోలు చేసిన వైనాన్నీ జేసీ బయటపెట్టారు. డబ్బులు పంచారంటూ వైసీపీ మీద తను ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. అయితే అసలు  కథ ఏమిటో.. జేసీనే విడమరిచి చెప్పారు!

మరింత సమాచారం తెలుసుకోండి: