ఏపీలోని ప్రజలే కాదు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేడీ మే 23. ఆ రోజున దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎవరు పవర్లోకి వస్తారు అన్నది కేవలం ఏపీ ప్రజలకే కాదు. దేశం మొత్తం జనాలకు కూడా అతి ముఖ్యమైపోయింది. అలా జరిగాయి మరి ఈ ఎన్నికలు.


ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందనే అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ అయితే టీడీపీకి అనుకూలంగా పెద్దగా సర్వేలు రాలేదన్నది నిజం. ఇక ఒక వేళ టీడీపీ ఓటమి పాలు అయితే పరిస్థితి ఏంటన్న చర్చ ఇపుడు సాగుతోంది. టీడీపీలో బాబు నాయకత్వంపై సీనియర్ల తిరుగుబాటు ఉంటుందా అన్న మాట కూడా వినిపిస్తోంది. అదే జరిగితే మరి టీడీపీ తరువాత నాయకుడు ఎవరు ఉంటారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.


ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆయన్ని ఢీ కొట్టడం కష్టమయ్యేది. అలాంటిది జగన్ అధికారంలోకి వస్తే మాత్రం ఆయన్ని తట్టుకుని నిలువరించే నాయకత్వం టీడీపీకి ఉందా అన్నది కూడా చూడాలి. బాబుకు ఇపుడు డెబ్బయి ఏళ్ళు ఆయన ఎంత చురుకుగా ఉన్నా అయిదేళ్ళ పాటు పార్టీని నడిపించి జనాల్లోకి తీసుకుపోగలరా. ఒకవేళ బాబుని కాదనుకుంటే మిగిలిన వారిలో ఎవరికి చాన్స్ ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి మే 23 ఫలితాలు పార్టీల జాతకాలు తేల్చేలా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: