ఆర్మీ చేరిక‌కు సంబంధించిన ప‌రీక్ష‌లో హైటెక్ కాపీ కొడుతున్న 15 మంది అభ్య‌ర్థుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై సెక్ష‌న్ 420, 120 కింద కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప‌రిధిలోని దసూహాలో చోటు చేసుకుంది. 


ప‌ట్టుబ‌డిన అభ్య‌ర్థుల జేబుల్లో డోంగల్, బ్యాటరీ, సిమ్‌కార్డు వంటి  ల‌బించాయి.  వాటి తో పాటు అభ్య‌ర్థుల క్లిప్ బోర్డుల‌పై మొబైల్‌ను దాచివుంచారు. బ్లూటూత్ కనెక్టివిటీ‌తో హర్యానాలో కూర్చున్న ఏజెంట్ వీరి చేత కాపీ కొట్టిస్తున్నాడు.


అయితే ఆర్మీలో భ‌ర్తీ కోసం ఫిజిక‌ల్ టెస్ట్ నిర్వ‌హించిన త‌ర్వాత మొత్తం 2,888 మంధి రాత ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల్సి ఉండ‌గా.. వారిలో 2688 మంది మాత్ర‌మే ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. 


కాగా.. ప‌ట్టుబ‌డిన అభ్య‌ర్థులంద‌రూ హ‌ర్యానా.. రాజ‌స్థాన్‌ల‌కు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ అభ్య‌ర్థులు హైటెక్ కాపీ విష‌యాన్ని సుబేదార్ కుల్విందర్ సింగ్ గుట్టుర‌ట్టు చేశారు. 


ఎగ్జామ్ స్టార్ట్ అయిన త‌ర్వాత కొద్దిమంది అభ్యర్థుల క్లిప్‌బోర్డుపై ఏదో ఎత్తుగా ఉన్నట్టు కనిపించింద‌ని పేర్కొన్నారు కుల్వీంద‌ర్ సింగ్‌. అనుమానం వ‌చ్చి వారిద‌గ్గ‌ర‌కు వెళ్లి చూశాడ‌న‌ని.. దీంతో వారి క్లిప్ బోర్డులు చెక్‌చేయగా మొబైల్ ఫోన్లు ఉన్నట్టు గమనించామ‌ని వెల్ల‌డించారు. 


వెంట‌నే వారిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తే ఈ హైటెక్ కాపీయింగ్ విష‌యం వెలుగులోకొచ్చింద‌ని తెలిపారు. వారిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: