పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అవుతారని ఎగ్టిట్ పోల్ సర్వేలు  చెబుతున్నాయి. జనసేనకు ఒకటి నుంచి అయిదు లోపు సీట్లు చాలా సర్వేలు ఇచ్చాయి. దాంతో పవన్ కచ్చితంగా కొత్త అసెంబ్లీలో సభ్యుడు కావడం ఖాయమని అంటున్నారు. 


ఇక లగడపాటి సర్వే పవన్ పార్టీకి ఏకంగా పది శాతం ఓటింగ్ కట్టబెడితే, మిగిలిన సర్వేలు అయిదారు శాతం ఇచ్చాయి. ఏది ఏమైనా పవన్ గెలవడం ఖాయమని మెజారిటీ సర్వేలు  చెబుతున్నాయి. దాంతో పవన్  ఫ్యాన్స్ ఇక ఆనందపడవచ్చు.  అదే విధంగా తాను ఒక్కడిని చాలు అసెంబ్లీలో ఉంటే జనం సమస్యలపై నిలదీస్తానంటూ పవన్ ఎన్నికల సభల్లో పదే పదే చెప్పారు. అలా ఒకే ఒక్కడు గా అసెంబ్లీకి వస్తాడో, వెంట నలుగురు జత అవుతారో కానీ పవన్ ముచ్చట మాత్రం తీరుతుందని ఎగ్టిట్ పోల్ సర్వేల వరకూ అంచనా వేశాయి. 


మరి తాను కింగ్ లేదా కింగ్ మేకర్ అనుకుంటే మాత్రం ఈసారి కుదరదని సర్వే ఫలితాలు స్పష్టంగా చెప్పేశాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, పైగా భారీ ఆధిక్యతతో వస్తుందని కూడా చెప్పుకొస్తున్నాయి సర్వేలు. అదే సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంటుంది. పవన్ సైతం ఈసారి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించేందుకు జనాలు అవకాశం ఇచ్చారనుకోవాలి ఈ సర్వేలు నిజమైతే.


మరింత సమాచారం తెలుసుకోండి: