గెలిచామని సంబరం కాదు, ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్లు వైఎస్ జగన్ ఎదుర్కోబోయే తొలి అగ్ని పరీక్ష మంత్రివర్గ  కూర్పు. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలిచారు. 151 మందితో పెద్ద పక్షంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. . అందరూ జగన్ కి సన్నిహితులే. అందరూ సీనియర్లే మరి. ఎవరు ఇందులో మంత్రులు అవుతారు. ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా  ఉంది.


జగన్ ఈ విషయంలో తగినంత సమయం తీసుకుని నేర్పుతో మంత్రివర్గం కూర్పు చేపట్టడానికే కొన్ని రోజులు వాయిదా వేశారని అంటున్నారు. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణం చేస్తారు.  మరో వారం అంటే జూన్ 6న మంత్రులు ప్రమాణం ఉంటుందని అంటున్నారు. కనీసంగా మరో పదిమందిని తీసుకుని తొలి విడతా పూర్తి చేస్తారని అంటున్నారు.


లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అయ్యాక పూర్తి విస్తరణ ఉంటుందని అంటున్నారు.  మొదటి విడతలో జిల్లాకు ఒకరు వంతున సీనియర్లను తీసుకోవాలని జగన్ ఆలోచనగా ఉంది. రానున్న ఆరు నెలల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్నికలు ఉన్నాయి. వాటిలో భారీ మెజారిటీతో గెలిచిన తరువాత జగన్ మరో మారు విస్తరణ చేపడతారని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టి మరీ లోకల్ బాడీస్ గెలిపించుకోవాలన్నది జగన్ ఆలొచనగా  ఉంది.


ఇదిలా ఉండగా స్పీకర్ పదవికి మలాది విష్ణుని తీసుకోవాలని జగన్ భావిస్తున్నారుట. ఆయన్ని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడం ద్వారా బ్రాహ్మణులకు తగిన న్యాయం చేసినట్లుగా ఉంటుందని, మరో బ్రాహ్మణ్ ఎమ్మెల్యే కోన రఘుపతిని మంత్రిని చేయాలని జగన్ ఆలొచనగా చెబుతున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: